Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి సంచారం చేయడం చాలా చాలా ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తారు. ఒక గ్రహం తన సొంతరాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజ, శుక్రగ్రహాలు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని మార్పులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అక్టోబర్ రెండో తేదీన శుక్రుడు సింహరాశిలోకి, మూడో తేదీన కుజుడు తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు జరుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేషరాశి వారు ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. దీంతోపాటు మీ మనసులో ప్రతికూల ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఎంతో ఏకాగ్రతతో ఉండడం చాలా మంచిది. మానసిక స్థితిలో కూడా హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. 


వృషభ రాశి:
వృషభ రాశి వారికి శుక్ర కుజ గ్రహాలు సంచారం చేయడం కారణంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మానసిక సమస్యలన్నీ దూరం కావడమే కాకుండా మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక విద్యను అభ్యసిస్తున్న వారైతే ఎంతో గౌరవం పొందుతారు. ఆదాయ వనరులు కూడా ఈ సమయంలో రెట్టింపు అవుతాయి.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం లోపిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే ఊహించని ప్రయోజనాలతో పాటు వ్యాపారాలు విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇది మంచి సమయంగా భావించవచ్చు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


సింహరాశి:
సింహ రాశి వారికి ఈ సమయంలో మానసికంగా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో స్వీయ నియంత్రణతో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కోపం మానుకోవడంతోపాటు ఇతరుల పట్ల సానుభూతితో మాట్లాడటం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో సింహ రాశి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయంలో మానసిక పరిస్థితిల్లో మార్పులు వస్తాయి. కాబట్టి స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా అవసరమైన కోపాన్ని కూడా మానుకోవాల్సి ఉంటుంది. సంభాషించే క్రమంలో తప్పకుండా సమతుల్యతను కాపాడుకోండి. ఇక వ్యాపారాల విషయానికి వస్తే అనేక రకాల లాభాలు కలుగుతాయి. దీంతోపాటు తండ్రి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి