Astrology - Shani Dev Gochar: నవగ్రహాల్లో శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడని పిలుస్తారు. ఈయన న్యాయానికి అధిపతి. ప్రతి ఒక్క వ్యక్తి వారి వారి కర్మానుసారం మంచి చెడు ఫలితాలను అందిస్తూ  ఉంటాడు. సత్కర్మలు చేసే వాళ్లకు శుభ ఫలితాలను అందిస్తే.. దుష్కర్మలు చేసే వాళ్లకు అదే రీతిలో శిక్షించడం శని దేవుడి సహజ సిద్ధ స్వభావం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా శనీదేవుడి ఏల్నాటి శని ప్రభావం ఎదుర్కోవాల్సిందే. శని దేవుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల మీద శని గ్రహం యొక్కఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.శనీశ్వరుడు ప్రతి రెండున్నర యేళ్లకు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక్కో రాశిలో ఎక్కువ సంవత్సరాలు ఉండటంతో ఈయనకు మందుడు, మంద గమనుడు అనే పేరు ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో పాపం మరియు క్రూరమైన గ్రహంగా అభివర్ణిస్తారు. జ్యోతిషశాస్త్రంలో శని రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శని రాశి మారడం వల్ల కొన్ని రాశుల మీద శని గ్రహం యొక్క ఏల్నాటి శని ప్రభావం మొదలవుతుంది, అయితే శని యొక్క ఏల్నాటి శని ప్రభావం కొన్ని రాశులపై ముగుస్తుంది.
శని ఈ యేడాది కుంభ రాశిలో సంచరిస్తాడు. ఇక మార్చి 18వ తేదీన శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి రాబోయే 289 రోజులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం సాగిపోతూ ఉంటుంది.


వృషభ రాశి..
కుంభరాశిలో శని ఉండటం వల్ల వృషభరాశి వారికి అనుకోని లాభాలు కలగనున్నాయి. ఈ రాశి వారి ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. ఇంట్లో ఆనందం మరియ శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయి. పోటీ పరీక్షలు సిద్దమవుతున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. స్నేహితులు సహకారంతో మరింత ముందుకు వెళతారు.


తులా రాశి..
కుంభరాశిలోకి శని దేవుడు ఆగమనం ద్వారా తులా రాశి వారు అనుకూల ఫలితాలను అందుకుంటారు. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్ధికంగా నిలుదొక్కుకుంటారు. ఇంట్లో సంతోషం శాంతి సామరస్యత వెల్లివిరుస్తాయి. శని దేవుడి దివ్య శుభ ప్రభావంతో చేసే వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి.


ధనుస్సు రాశి..
కుంభరాశిలో శని ఉదయించడం వల్ల 30 యేళ్ల తర్వాత ధనుస్సు రాశి వారికి అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఆర్ధిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. మీ బాస్ మరియు సహోద్యోగుల సహకారంతో మీరు కెరీర్‌లో అన్ని పనులను పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లే వారికి ఇదే సరైన తరుణం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.



Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook