Astrology - Shani Dev: నవగ్రహాల్లో రవి పుత్రడైన శనిశ్వీరుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో సవ్యదిశలో సాగిపోతున్నాడు. శని ఈ యేడాది తన రాశిని మార్చుకోకపోయినా.. తన మార్గాన్ని మాత్రం మార్చుకుటుంది. అంతేకాదు కుంభరాశిలో తిరోగమనం చెందుతాడు. శని వక్ర గమనం కారణంగా కొన్ని రాశుల వారికీ లాటరీ తగిలినట్టే. శని దేవుడు మనుషులు చేసే కర్మానుసారం తన ఫలితాలను అందిస్తుంటాడు. ఈయన చెడు ఫలితాలతో పాటు మంచిని కూడా చేస్తాడు. శని వక్రగమనం వల్ల జూన్ 30 నుంచి ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉందో మీరు ఓ లుక్కేయండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి..


మీరు పనిచేసే ఆఫీసులో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఆనుకోని లాభాలు. మనుసులో ఆనందం వెల్లివిరుస్తుంది. విహార యాత్రలకు ఇదే సరైన సమయం. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. అంతేకాదు భూములు లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనువైన సమయం.


మిథున రాశి..


శని వక్రగమనం కారణంగా ఈ రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. పనిచేసే కార్యాలయాల్లో తగిన వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగుల సాయంతో కష్టమైన పనులు కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు. వ్యాపారస్థులకు అనుకోని ధనలాభం. విహార యాత్రలకు ఇదే అనువైన సమయం. కుటుంబ సభ్యుల నుండి తగిన మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. మీ విశ్వసనీయతే మీకు శ్రీరామరక్ష.


సింహ రాశి..


శని వక్రగమనం వల్ల సింహ రాశి వారికి అధికారుల అండ లభిస్తుంది. కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగుల నుంచి సంపూర్ణ మద్ధతు అందుకుంటారు. జీవితంలో అన్ని అడ్డంకులు తొలిగిపోతాయి. ఆర్ధికంగా బాగుంటుంది. వ్యాపారస్థులకు ఇది అనుకూలమైన సమయం.


కన్య రాశి..
శని వక్రగమనం వల్ల మీ కార్యాలయాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగిపోతారు. కష్టమైన పనులను కూడా ఇష్టంగా చేస్తారు. పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం.  కుటుంబం మద్ధతు లభిస్తుంది. భాగస్వామితో అన్ని విషయాల్లో సానుకూలంగా సాగిపోతారు.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook