Shani Mahadasha effect: జాతకంలోని గ్రహాలు మంచి స్థానంలో ఉంటేనే మనం మంచి ఫలితాలు పొందుతాం. కాలానుగుణంగా ఫ్లానెట్స్ ఒక్కో సమయంలో ఒక్కో గ్రహం తన ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి గ్రహానికి తనకంటూ ఓ మహాదశ ఉంటుంది. ఇది కొన్ని ఫ్లానెట్స్ కు ఎక్కువగా, మరికొన్నింటికి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం శని యెుక్క మహాదశ గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా శనిమహాదశ ప్రతి వ్యక్తిపై 19 సంవత్సరాలు ఉంటుంది. శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ఎవరి జాతకంలో శని శుభస్థానంలో ఉంటారో వారికి దేనికీ లోటు ఉండదు. ఏ వ్యక్తి కుండలిలో శని అశుభస్థానంలో సంచరిస్తాడో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. శని తలుచుకుంటే బిచ్చగాడిని బిలియనీర్ చేస్తాడు, ధనవంతుడిని కూడా దరిద్రుడిగా మారుస్తాడు.


శని మహాదశ యొక్క ప్రభావాలు
జాతకంలో శనిదేవుడు అశుభంగా ఉన్నప్పుడు
ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంలో శని మహాదశను ఎదుర్కోవల్సి ఉంటుంది. జాతకంలో శనిదేవుడు ప్రతికూల స్థానంలో ఉంటే వాకు భారీగా డబ్బు నష్టపోతారు. వ్యాపారంలో లాస్ వస్తుంది. సమాజంలో గౌరవం పోతుంది. ఆర్థికంగా మీరు సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. 
శని సానుకూల స్థానంలో ఉంటే
మరోవైపు, జాతకంలో శని గ్రహం ఉచ్ఛ స్థితిలో లేదా అశుభంగా స్థానంలో ఉంటే మీరు భారీగా సంపదను గడిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. పాలిటిక్స్ లో ఉన్నవారు పదవిని పొందే అవకాశం ఉంది.  


శని దోషం పోవాలంటే ఈ చర్యలు చేయండి
1. శనివారం నాడు ముందుగా పీపల్ చెట్టు కింద నాలుగు ముఖాల ఆవనూనె దీపం వెలిగించాలి.
2. శని దేవాలయానికి వెళ్లి శని విగ్రహం ముందు ఆవనూనె దీపం వెలిగించి శని చాలీసా చదవండి.
3. స్త్రీలు, పెద్దలు, నిస్సహాయులును అవమానించకూడదు. ఇలా చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది.
4. శని దేవుడి తాంత్రిక మంత్రం "ఓం ప్రాణ్ ప్రిం ప్రౌన్ సః శనైశ్చరాయ నమః" 108 సార్లు జపించండి. 


Also Read: Rahu Ketu Gochar 2023: త్వరలో రాహు-కేతువుల సంచారం... ఈరాశుల జీవితం నరకప్రాయం.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.