Zodiac Signs Personality : కొంతమందిలో చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పది మందిని ముందుండి నడిపించడం... ఏదైనా సమస్య వస్తే ముందు పడి పరిష్కరించడం వంటి లక్షణాలను వారు కలిగి ఉంటారు. నాయకత్వమంటే అంత ఆషామాషీ కాదు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయగలిగే తెలివి.. క్లిష్ట పరిస్థితుల్లో తెగింపుతో కూడిన నిర్ణయాలు అవసరమవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని 3 రాశుల వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఆ మూడు రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం : వృషభ రాశి వ్యక్తులు ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు. వారిని నియంత్రించడం అంత సులువు కాదు. మొండి పట్టుదలతో, పంతంతో ముందుకెళ్తుంటారు. అనుకున్నది నెరవేర్చే వరకు వీరు వెనక్కి తగ్గే రకం కాదు. ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి వస్తే సామ దాన భేద దండోపాయాలతో వారిని దారికి తెచ్చుకుంటారు. వీరి ఆత్మవిశ్వాసానికి ప్రత్యర్థులు సైతం హడలిపోతారు.


సింహ రాశి : సింహం అంటే అడవికి రారాజు. సింహ రాశి వారు కూడా రారాజు లాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. నిర్భయంగా, ధైర్యంగా ముందుకు సాగుతారు. వాక్చాతుర్యంలో వీరు నిష్ణాతులు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను పునికి పుచ్చుకుంటారు. ప్రత్యర్థులు సైతం వీరి విషయాల్లో జోక్యం చేసుకోవాలంటే జంకుతారు. సింహ రాశి వారికి మనో ధైర్యం చాలా ఎక్కువ.


వృశ్చికం : వృశ్చిక రాశి వారికి ముందు చూపు చాలా ఎక్కువ. ముసుగులో గుద్దులాట వీరికి నచ్చదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటారు. ఎదుటివారి ఆలోచనలను ఇట్టే పసిగట్టగలరు. తమ సామర్థ్యంతో ఎవరినైనా తమ నియంత్రణలోకి తెచ్చుకోగలరు. వీరికి ఉన్న నాయకత్వ లక్షణాలతో అద్భుతమైన నాయకులుగా నిరూపించుకుంటారు. 


Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-సమంత సినిమాకు పవన్ కల్యాణ్ మూవీ టైటిల్..?   


Sadhvi Ritambara: ఒక్కొక్క హిందువు నలుగురిని కనాల్సిందే, సాధ్వి రితాంబర వివాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook