Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-సమంత సినిమాకు పవన్ కల్యాణ్ మూవీ టైటిల్..?

Vijay Deverakonda Samantha Movie: విజయ్ దేవరకొండ-సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 10:05 AM IST
  • విజయ్ దేవరకొండ-సమంత సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
  • శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ నెల 21న లాంచ్ అవనున్న సినిమా
  • ఈ సినిమాకు పవన్ మూవీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-సమంత సినిమాకు పవన్ కల్యాణ్ మూవీ టైటిల్..?

Vijay Deverakonda Samantha Movie: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. నిజానికి ఈ సినిమా అటకెక్కినట్లేనని అప్పట్లో ప్రచారం జరిగింది. శివ నిర్వాణ 'టక్ జగదీశ్' ఫ్లాప్ అవడం, విజయ్ దేవరకొండ చేతికి మరిన్ని ప్రాజెక్ట్స్ రావడంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందో ఉండదోనన్న సందేహాలు కలిగాయి. అయితే వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ ఈ నెల 21న అధికారికంగా ఈ సినిమా లాంచ్ అవనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్‌గా నటించనుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి 'మహానటి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఇద్దరివీ సైడ్ క్యారెక్టర్సే. తొలిసారి ఈ ఇద్దరు కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే... ఈ సినిమాకు 'ఖుషీ' టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కథా పరంగా సినిమాకు ఆ టైటిల్ బాగుంటుందనే ఉద్దేశంతో మేకర్స్ ఖుషీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథ విషయానికొస్తే... ఈ సినిమాలో సమంత కశ్మీరీ యువతిగా కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 24 లేదా 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్‌లో స్టార్ట్ అవనున్నట్లు తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్-భూమిక హీరో హీరోయిన్లుగా 2001లో విడుదలైన 'ఖుషీ' సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్-సమంత సినిమాకు 'ఖుషీ' టైటిల్ ఫిక్స్ చేయొచ్చుననే ప్రచారంతో సినిమాపై అప్పుడే బజ్ క్రియేట్ అయినట్లయింది. విజయ్, సమంత లాంటి ఇద్దరు బెస్ట్ పెర్ఫామర్స్‌ కలిసి నటిస్తున్న సినిమా కావడం.. 'ఖుషీ' లాంటి పవర్‌ఫుల్, రొమాంటిక్ మూవీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చెబుతుండటంతో ప్రేక్షకుల్లో అప్పుడే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ టైటిల్‌కి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

Also Read: Jio Airtel: మీరు జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లా.. రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే...

Anakapalli: సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ కళ్లు మూసుకోమంది... కత్తితో గొంతులో పొడిచింది.. కాబోయే భర్తపై యువతి దాడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News