Mars Transit 2023: మంగళగ్రహం గోచారం, ఈ మూడు రాశులకు 2023 కొత్త ఏడాదిలో ఊహించని అభివృద్ధి, అంతా డబ్బే
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. మంగళగ్రహం గోచారం 3 రాశుల కెరీర్లో వృద్ధి, సంతోషం, అంతులేని డబ్బు తీసుకురానుంది.
జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం పెళ్ళి, భూమి, సాహసం, పరాక్రమం, సంపదకు కారకం. అలాంటి మంగళ గ్రహం గోచారం ప్రభావం 3 రాశుల జీవితాలపై శుభ సూచకంగా ఉంటుంది. ముఖ్యంగా 2023లో అంతులేని డబ్బు లభిస్తుంది.
జ్యోతిశష్యం ప్రకారం మంగళ గ్రహం గోచారం ప్రభావం మూడు రాశులపై చాలా అనుకూలంగా ఉంటుంది.పెళ్లి కుండలిలో మంగళ గ్రహం స్థితికి చాలా మహత్యముంటుంది. మంగళ గ్రహం అశుభ స్థితిలో ఉంటే..ఆ వ్యక్తి కోపిష్టి, అహంకారిగా ఉంటాడంటారు. 2023 కొత్త ఏడాది ప్రారంభంలో మంగళగ్రహం గోచారంలో మార్పు రానుంది. మంగళగ్రహం ప్రస్తుతం వృషభంలోనే వక్రమార్గంలో ఉండగా,త్వరలో అంటే జనవరి 13 నుంచి సక్రమమార్గంలో రానున్నాడు. ఫలితంగా 3 రాశులవారిపై మెరుగైన ప్రభావం పడనుంది.
మంగళగ్రహం గోచారంతో ఏయే రాశులకు ఎలాంటి ప్రయోజనాలు
మేషరాశి Aries Zodiac
మంగళగ్రహం గోచారం మేషరాశివారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈ జాతకులకు అంతులేని ధనలాభం కలుగుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టమై ఉపశమనం కలుగుతుంది. టీచింగ్, మార్కెటింగ్, మీడియా రంగాల్లో ఉండేవారి కెరీర్ లాభదాయకంగా ఉంటుంది.
సింహ రాశి Leo Zodiac
మంగళ గ్రహం సక్రమమార్గం కారణంగా సింహరాశి జాతకులకు అత్యంత శుభ సూచకంగా ఉంటుంది. ఈ జాతకులకు ఎక్కువగా కెరీర్‌పరంగా లాభముంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కలుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. బాధతలు పెరుగుతాయి.
కన్యారాశి Virgo Zodiac
మంగళగ్రహం సక్రమ మార్గం కారణంగా కన్యారాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ జాతకంవారికి అదృష్టం తోడుగా నిలుస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. పనుల్లో విజయం లభించడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. చాలా కీలకమైన పనులు పూర్తవుతాయి. విదేశీయాత్ర చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook