Surya Gochar 2022: ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో సంచారం చేస్తూ ఉంటాయి. అయితే ఈ సంచారాలు చేయడం వల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు మనిషి జీవితాల్లో చాలా రకాల మార్పులను తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పలు రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నెలలో జరిగే సూర్య, బుధ సంచారం వల్ల బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. దీని వల్ల అన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. బుధాదిత్య రాజ్యయోగం చాలా పవిత్రమైనది.. విజయం, సంపద, గౌరవం సూచికలుగా భావిస్తారు. ముఖ్యంగా ఈ 3 రాశులవారు వచ్చే సంవత్సరంలో ఊహించని లాభాలు పొందుతారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశిలవారిపై బుధాదిత్య రాజ్యయోగం ఎఫెక్ట్:
వృషభ రాశి:
బుధుడు, సూర్య గ్రహాల సంచారం వల్ల వృషభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో అన్ని రాశులవారి కంటే ఈ రాశివారు ఊహించని లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రాశి వారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు పొందడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. వృషభ రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందుతారు.
మిథున రాశి:
ఈ బుధాదిత్య రాజయోగం మిథున రాశి వారికి కూడా చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో చాలా రకాల సంతోషాలు పొందుతారు. ఈ క్రమంలో ప్రేమ జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కుంభ రాశి:
బుధ, సూర్యుల సంచారం వల్ల ఏర్పడే రాజయోగం వల్ల కుంభ రాశి వారు కూడా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరి ఆదాయంలో మార్పులు కూడా రావొచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జీవితంలో సుఖాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ కుంభ రాశి వారికి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IND Vs AUS: ఉత్కంఠభరిత పోరు.. పోరాడి ఓడిన భారత్
Also Read: FD Interest Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook