Astro Tips: జ్యోతిష్య శాస్త్రంలో కాల దోషాలు, గ్రహ దోషాలకు పరిష్కార మార్గాలు సూచించబడ్డాయి. వాటిని పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించవచ్చు. కొన్ని సమస్యలను అధిగమించేందుకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండకపోవచ్చు. అలాంటి వాటికి జ్యోతిష్య సంబంధిత కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి జ్యోతిష్యంలో సూచించబడిన కొన్ని చిట్కాలను పాటిస్తే పలు సమస్యల నుంచి గట్టెక్కడమే కాదు.. జీవితాన్ని సంతోషంగా గడపవచ్చునని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా చేస్తే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు :


ఒక శుభ్రమైన పాత్రలో మంచి నీటిని తీసుకుని.. అందులో కొంత పంచదార కలపాలి. ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉండటంతో పాటు అది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి గట్టెక్కడంలో ఇది చాలావరకు దోహదపడుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహతో సమస్యలను అధిగమించవచ్చు.


కాకికి పంచదార :


ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు కాకికి పంచదార ఇస్తే ఆ సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార రంగంలోనూ వృద్ది ఉంటుంది. అంతేకాదు, గ్రహ దోషాలు కూడా దీని ద్వారా పరిష్కరించబడుతాయి. 


ఇలా చేస్తే విజయం సిద్ధిస్తుంది :


ముఖ్యమైన పనులలో విజయం సాధించాలంటే.. రాగి గిన్నెలో చక్కెర కలిపిన నీటిని రాత్రంతా ఉంచండి. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఈ మిశ్రమాన్ని తాగండి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టే అన్ని పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయని జ్యోతిష్యం చెబుతోంది.


Also Read: Etela Rajender Birthday: ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు...


Also Read: Russia-Ukraine war: రష్యా దాడులకు వందల సంఖ్యలో ఉక్రెయిన్ చిన్నారులు బలి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook