Russia-Ukraine war: రష్యా దాడులకు వందల సంఖ్యలో ఉక్రెయిన్ చిన్నారులు బలి!

Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్​ మధ్య యుధ్దం కారణంగా ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఏ పాపం తెలియని చిన్నారులు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్​లో 115 మంది చిన్నారులు యుద్ధం వల్ల మృతి చెందారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 05:40 PM IST
  • అమాయకుల పాలిట శాపంపగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
  • వందల సంఖ్యలో చిన్నారులు బలి
  • ఆందోళన వ్యక్తం చేసిన ఉక్రెయిన్​ పార్లమెంట్​
Russia-Ukraine war: రష్యా దాడులకు వందల సంఖ్యలో ఉక్రెయిన్ చిన్నారులు బలి!

Russia-Ukraine war: దాదాపు నెల రోజులుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. రష్యా చేస్తున్న దాడుల వల్ల ఉక్రెయిన్​కు తీవ్ర నష్టం వాటిళ్లుతోంది. రష్యా ప్రయోగిస్తున్న మిస్సైల్ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో చాలా మంది సామాన్యులు, అన్యం, పుణ్యం ఎరుగని చిన్నారుల సంఖ్య అధికంగా ఉండటం ఆందోళనకరం.

ఇదే విషయంపై ఉక్రెయిన్ పార్లమెంట్​ కూడా ఆదివారం స్పందించింది. ఉక్రెయిన్​పై రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 115 మంది చిన్నారులు ప్రాణాలు విడిచారని తెలిపింది. అంత కాకుండా 140 మందికిపైగా ఉక్రెయిన్ యువకులు గాయాలపాలయ్యారని వివరించింది. ఇవి గణాంకాలు కావని..  వందలాది ఉక్రెయిన్​ కుటుంబాల బాధలు అని అభివర్ణించింది పార్లమెంటు.

ఇదిలా ఉండగా.. మార్చి 19 రాత్రి ఖార్కీవ్ నగరంపై రష్యా చేసిన ఎయిర్​ స్ట్రైక్​లో ఐదు మంది చిన్నారులు (9 ఏళ్ల బాలుడు సహా) ప్రాణాలు కోల్పోయారని కీవ్​ ఇండిపెండెంట్​ తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియుపోల్​లోని 400 మంది ఆశ్రయం విద్యార్థులు ఉన్న పాఠశాలపై కూడా రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఈ దాడుల కారణంగా పాఠశాల భవనం ధ్వంసమైందని.. శిథిలాలకింద చాలా మంది చిక్కుకున్నట్లు వెల్లడించింది. అయితే మరణాల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.

జాతినుద్దేశించి వొలొదిమిర్​ జెలన్​స్కీ ప్రసంగం..

ఇక ఆదివారం ఉదయం వొలొదిమిర్ జెలన్​స్కీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఎంతో ప్రశాంతంగా ఉండే మారియుపోల్​పై రష్యా దాడులు, రష్యా దళాల అక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. రాబోయే తరాలు గుర్తుండిపోయే భయంకరమైన విషయం అవుతుందన్నారు.

Also read: China Corona Update: చైనాలో కొవిడ్​ కల్లోలం- రెండేళ్ల తర్వాత మరణాలు నమోదు!

Also read: ఏడేళ్ల వయసులో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత ఆమెను చంపిన యువకుడు.. 101 సార్లు కత్తితో పొడిచి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News