Coconut Remedies: కొబ్బరి కాయను సనాతన ధర్మంలో శ్రీఫలం అంటారు. అంటే పండ్లలో అత్యుత్తమమైనది. కొబ్బరికాయను ప్రధానంగా పూజలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా, కొత్తగా ఏ పని మొదలుపెట్టాలన్నా లేదా ఏదైనా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించాలన్నా మొదట కొబ్బరికాయ కచ్చితంగా కొట్టాల్సిందే. తద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. జ్యోతిషశాస్త్రంలో కొబ్బరికాయకు కూడా చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది.జ్యోతిష్య శాస్త్రంలో కొబ్బరికాయతో కొన్ని దోష పరిహారాలు కూడా సూచించబడ్డాయి. వాటిని పాటించడం ద్వారా కష్ట,నష్టాలు తొలగిపోతాయి. సంపద, సంతోషం సొంతమవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరికాయతో ఇలా చేస్తే ఆ సమస్యలు దూరం :


శని దోషం నుండి బయటపడటానికి కొబ్బరికాయతో పరిహారం: జాతకంలో శని దోషం ఉంటే జీవితం సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఈ సమస్యలు ఆర్థికంగా, శారీరకంగా లేదా మానసికంగా ఉండవచ్చు. వీటన్నింటి నుంచి బయటపడాలంటే శనివారం నాడు మీ చేతులతో కొబ్బరికాయను నదిలో వేయండి. ఆ సమయంలో హనుమంతుని 'ఓం రామదూతాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. అన్ని కష్టాల నుంచి బయటపడేయమని హనుమంతుడిని ప్రార్థించాలి. తద్వారా మీరు కష్టాల నుంచి గట్టెక్కుతారు.


విజయం చేకూరాలంటే : పనిలో తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇది ఇంటికి పట్టిన నెగటివిటీని తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టే పనుల్లో విజయం చేకూరుతుంది.


సంపద పెరిగేందుకు: వృత్తి-వ్యాపారాలలో పురోగతి లేకపోతే.. ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నట్లయితే గురువారం నాడు కొబ్బరికాయ, పసుపు పువ్వులు, పసుపు ముడి, పసుపు రంగు మిఠాయిలను ఒక పసుపు వస్త్రంలో కట్టి శ్రీ మహావిష్ణువుకు సమర్పించండి. మనస్సుల్లో ఆ దైవాన్ని బలంగా వేడుకోండి.


సంతోషకరమైన దాంపత్యానికి పరిహారం: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, విబేధాలు ఉంటే ఇంట్లో దేవుడి చిత్రపటం ముందు కొబ్బరికాయను ఉంచి పూజించాలి. ఇలా రోజూ పూజిస్తే కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. 


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)



Also Read: TS TET  Results 2022: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల.. అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి..


Also Read:TS JOB Notification: రేపోమాపో టీచర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ! భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇవిగో.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook