Ram mandir pran pratishtha live: వివాదం నుంచి మొదలై రామమందిరం నిర్మాణం వరకూ సాగిన ప్రస్థానంలో 550 ఏళ్ల తరువాత రామ భక్తుల కల నెరవేరనుంది. ఇవాళ అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. రాముడిపై నమ్మకం కలిగినవారికి ఇవాళ్టి రోజు ఓ  దీపావళి. అందుకే వారం రోజుల్నించి అయోధ్యలో దీపావళి జరుగుతోంది. 550 ఏళ్ల క్రితం ఉన్న రామమందిరం తిరిగి నిర్మితమైందనే ఆనందం భక్తుల్లో కన్పిస్తోంది. మద్యాహ్నం 12..05 గంటల్నించి 12.55 గంటల వరకూ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ లలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దూరదర్శన్, డీడీ న్యూస్, జీ న్యూస్ సహా అన్ని ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దూరదర్శన్ నుంచి అన్ని ఛానెళ్లకు లైవ్ లింక్ లభించనుంది. అయోధ్య రామమందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొత్తం దూరదర్శన్ అన్ని ఛానెళ్లు, యూట్యూబ్ చానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. లైవ్ స్ట్రీమింగ్ ఇవాళ ఉదయం 11 గంటల్నించే ప్రారంభం కానుంది. ఈ లైవ్ కోసం రామమందిరం సహా అయోధ్యలోని విభిన్న ప్రాంతాల్లో దూరదర్శన్ మొత్తం 40 కెమేరాలు ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని ప్రైవేట్ ఛానెళ్లకు దూరదర్శన్ ద్వారానే ఫీడ్ లభిస్తుంది. 


అయోధ్యలోప్రాణ ప్రతిష్ఠ సమయంలో రామమందిరం గర్భగుడిలో రాముడు కొలువుదీరనున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరాన్ని ప్రారంభిస్తారు. ఆలయం ప్రదాన పూజారి బృందం రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో గర్భగుడిలో ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ప్రధాన పూజరి సత్యేంద్ర దాస్ ఉంటారు. 


అయోధ్యలో రామ్ లలా ప్రాణ ప్రతిష్ఠ కార్కక్రమం శుభ ముహూర్తం కేవలం 84 సెకన్లదే ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ మద్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాలు 32 సెకన్ల మధ్యలో ఉంటుంది. ఇవాళ మేషమాసంలో ద్వాదశ తిధి. ప్రాణ ప్రతిష్ఠ అభిజీత్ ముహూర్తం, ఇంద్రయోగం, మృగశిర నక్షత్రం మేష లగ్నం, వృశ్చిక రాశిలో జరుగుతోంది. ఇవాళ అయోధ్య నగరి మొత్తం దేదీప్యమానంగా, రంగురంగుల పూల అలంకరణతో వెలిగిపోతోంది. రేపట్నించి సామాన్య భక్తులకు రామమందిరం దర్శనం అనుమతి ఉంటుంది. 


Also read: Budh Gochar 2024: మరో 10 రోజుల్లో బుధుడు రాశి మార్పు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..>



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook