Ram mandir pran pratishtha schedule: ఏళ్ల తరబడి నిరీక్షణ తరువాత అయోధ్యలో నిర్మితమైన రామమందిరం ఇవాళ ప్రారంభం కానుంది. రామమందిరంలో మద్యాహ్నం బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. మరి ఇంతకాలం పూజలు జరిపిన పాత విగ్రహాన్ని ఏం చేస్తారనేదే అసలు ప్రశ్న. ఆ వివరాలు మీ కోసం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాముడి జన్మస్థలంలో నిర్మితమైన కొత్త రామాలయంలో మరి కాస్సేపట్లో శాస్త్రోక్తంగా రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. జనవరి 22 వతేదీ 2024 అంటే ఇవాళ మద్యాహ్నం 12.30 గంటలకు అత్యంత కీలకమైన రామ్‌లలా ప్రాణ ప్రతిష్ట ముహూర్తం ఫిక్స్ అయింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన కొత్త విగ్రహానికి ఈ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. మరి పాత విగ్రహాన్ని ఏం చేస్తారు..అదెక్కడ ఉంటుంది..


మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారుచేసిన రామ్‌లలా కొత్త విగ్రహం జనవరి 17వ తేదీనే రామాలయంలోని గర్భగుడికి చేరుకుంది. హైందవ శాస్త్ర విధానంలో అనుష్టానం నిర్వహించారు. నిన్న అంటే జనవరి 21నన రామ్‌లలా పాత విగ్రహం ఏదైతే ఇప్పటి వరకూ పూజలు అందుకుందో ఆ విగ్రహం కూడా కొత్త గర్భగుడికి చేరింది. ఈ విగ్రహం కూడా గర్భగుడిలోనే ఉంటుంది. దీనిని ఉత్సవ విగ్రహంగా ఉంచుతారు. ఈ విగ్రహం 10 కిలోల వెండితో నిర్మితమైందని చెబుతారు. రామ్‌లలా పాత విగ్రహంతో పాటు రాముని ముగ్గురు సోదరులు, హనుమాన్ విగ్రహాలు కూడా గర్భగుడికి చేరుకున్నాయి.


అయోధ్యలో ఇవాళ్టి షెడ్యూల్ ఇలా


ఉదయం 10 గంటలకు మంగళ వాయిద్యం ఉంటుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్నించి 50కు పైగా వాయిద్య కళాకారులు పాల్గొంటారు.


ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య  రామమందిరానికి చేరుకుంటారు. ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోదీ చేతులమీదుగా జరగనుంది. రామ్‌లలా కొత్త విగ్రహాన్ని మోదీనే ప్రతిష్ఠించనున్నారు.


ఉదయం 11 గంటలకు అతిధులు చేరుకుంటారు


ఉదయం 11.30 గంటల నుంచి మద్యాహ్నం 12.35 గంటల వరకూ గర్భగుడిలో పూజలు జరుగుతాయి. ఈ మధ్యలో 84 సెకన్ల శుభముహూర్తంలో రామ్‌లలా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది. 


మద్యాహ్నం 12.35 గంటల్నించి ముఖ్య అతిధుల ప్రసంగాలు


మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 7 గంటల వరకూ అతిధుల రాముని దర్శన కార్యక్రమం


మద్యాహ్నం 2.25 గంటలకు కుబేర్ తిల వద్ద శివమందిరంలో ప్రధాని మోదీ పూజలు


Also read: Ram mandir pran pratishtha live: మరి కాస్సేపట్లో అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట, ఇంట్లోంచే ఇలా లైవ్ చూడండి, ఎందులోనంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook