Bathukamma 2021 festival: బతుకమ్మ పండగ సంబరాలు షురూ
Bathukamma 2021 festival date, time and significance : దసరా నవరాత్రులు (Dussehra 2021) తరహాలోనే బతుకమ్మ పండగ కూడా 9 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, కొన్ని చోట్ల బతుకమ్మ పండగను నవ రాత్రులలో తొలి రోజు, చివరి రోజు మాత్రమే జరుపుకుంటారు.
Bathukamma 2021 festival: బతుకమ్మ పండగ వచ్చేసింది. తెలంగాణ సంప్రదాయం, నాగరికతను ఉట్టిపడేలా ఆడపడుచులు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ పండగ సంబరాలు నేటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణలో ప్రతి ఇంటి ఆడపడుచు పుట్టినిల్లు చేరి, తోబుట్టువులతో, తల్లిదండ్రులతో జరుపుకునే పూల పండగ ఇది. బతుకమ్మ పండగతో గౌరమ్మను కొలిచే సంప్రదాయం తెలంగాణలో ఈనాటికి కాదు. అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతీ ఏడాది దసరా పండగకు ముందు వచ్చే అమావాస్యతో (Pitru amavasya 2021) ఈ బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
గతేడాది కరోనావైరస్ మహమ్మారి కారణంగా బతుకమ్మ వేడుకలను ఎన్నో ఆంక్షల మధ్య సాదాసీదాగా నిర్వహించాల్సి వచ్చింది. గత సంవత్సరంలో పోలిస్తే.. ప్రస్తుతం కరోనావైరస్ (Coronavirus) ప్రభావం చాలామేరకు తగ్గడంతో ఈసారి మరింత ఉత్సాహంతో బతుకమ్మ పండగ జరుపుకునేందుకు తెలంగాణలో ప్రతీ ఇంటి ఆడపడుచులు ఎదురుచూస్తున్నారు.
దసరా నవరాత్రులు (Dussehra 2021) తరహాలోనే బతుకమ్మ పండగ కూడా 9 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, కొన్ని చోట్ల బతుకమ్మ పండగను నవ రాత్రులలో తొలి రోజు, చివరి రోజు మాత్రమే జరుపుకుంటారు. తొలిరోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ పండుగ (Engili pula bathukamma) అని, చివరిరోజున సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు.
బతుకమ్మను గౌరమ్మగా భావించి, మాకు బంగారు భవిష్యత్తును, మాంగళ్య బలాన్ని ఇవ్వు తల్లీ అని ఆటాపాటలతో పూజించి ఆడుకున్న తర్వాత అదే బతుకమ్మను నీళ్లలో విడిచిపెట్టడం (Bathukamma festival pooja) బతుకమ్మ పండగ ప్రత్యేకత. బతుకమ్మ పండగ సంబరాల కోసం ప్రభుత్వం సైతం గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీల చేత ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయించింది.