Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఏప్రిల్ 27న గురుడు మేషరాశిలోఉదయించాడు. బృహస్పతి రైజింగ్ వల్ల హన్స్ రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని శుభకరమైనదిగా భావిస్తారు. గురుడు ఉదయించడం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
హన్స్ రాజయోగం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి మీ రాశి నుండి లగ్న గృహంలో సంచరించబోతుంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీకు లాభం ఉంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు కెరీర్‌లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. 


కర్కాటక రాశి
ఈ రాశి వారికి హన్స్ రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. బృహస్పతి మీ రాశి యొక్క కర్మ గృహంలో ఉదయించబోతున్నాడు.  మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.


సింహరాశి 
గురు ఉదయం సింహరాశి వారికి మేలు చేస్తుంది. బృహస్పతి మీ రాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బును పొదుపు చేస్తారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 


Also Read: Mangal Gochar 2023: మరో 2 రోజుల్లో ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీది ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook