Chandra Grahan 2023 In India: నేటి చంద్ర గ్రహణం ప్రత్యేకతలు ఏంటి ? సూతకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ?

Chandra Grahan 2023 Date and Timings In India: మే 5న ఈ ఏడాదిలో తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. హిందువుల ఆచారాల ప్రకారం చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం సమయాల్లో క్రమం తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తుంటారు. అలా పాటించేవి, పాటించకూడని పనుల జాబితా చాలా పెద్దదే ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2023, 05:01 AM IST
Chandra Grahan 2023 In India: నేటి చంద్ర గ్రహణం ప్రత్యేకతలు ఏంటి ? సూతకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ?

Chandra Grahan 2023 Date and Timings In India: 2023లో తొలి చంద్రగ్రహణం వచ్చేసింది. నేడు మే 5న రాత్రి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. గతంలో వచ్చిన చంద్రగ్రహణాలకు ఈ చంద్రగ్రహణానికి తేడా ఉంది. ఈ ఏడాదిలో వస్తున్న మొదటి పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఇది. చంద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుందంటే.. చంద్రుడు భూమి నీడలోకి వెళ్లినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడలో ఉన్న కారణంగా చంద్రుడు చీకట్లో కలిసిపోతాడు. రేపు సంభవించనున్న చంద్ర గ్రహణాన్ని పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అని అంటారు. చంద్రుడు భూమి నీడ వెలుపలి ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఏర్పడే చంద్ర గ్రహణాన్ని పెనుంబ్రా చంద్ర గ్రహణం అంటారు. ఒకరకంగా ఇది పాక్షిక చంద్రగ్రహణానికి, సంపూర్ణ చంద్ర గ్రహణానికి మధ్య రకం లాంటిదే. పెనుంబ్రల్ చంద్ర గ్రహణానికి భిన్నమైన చంద్ర గ్రహణాన్ని అంబ్రా చంద్ర గ్రహణం అని పిలుస్తారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోంచి వెళ్లే క్రమంలో ఏర్పడేదే ఈ అంబ్రా చంద్ర గ్రహణం అని పిలుస్తారు. ఈసారి చంద్ర గ్రహణానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. గౌతమ బుద్ధుని పుట్టిన రోజుగా భావింటే వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ నాడే ఈ చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. 

టైమ్ అండే డేట్.కామ్ అనే వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల వారికి ఈ చంద్రగ్రహణం దర్శనం ఇస్తుంది. ఈ చంద్ర గ్రహణం ఇండియాలోనూ చూడొచ్చు. అయితే, ఆకాశం నిర్మలంగా ఉంటేనే అది సాధ్యపడుతుంది. అలాకాకుండా వాతావరణంలో మార్పుల కారణంగా మబ్బులు అలుముకుంటే చంద్ర గ్రహణం వీక్షించడానికి వీలు పడకపోవచ్చు.

సూతక సమయాలు :
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, పూణేతో పాటు ఇంకొన్ని చోట్ల ఈ పెనుంబ్రల్ చంద్రగ్రహణం కనిపిస్తుంది. సాధారణంగా చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం ఏర్పడటానికి ముందు, ఆ తరువాత వచ్చే సమయాలను సూతకం సమయాలుగా భావిస్తుంటాం. ఈ సూతక సమయాలను అశుభంగా పరిగణించడం జరుగుతుంది. పండితులు చెబుతున్న వివరాల ప్రకారం, సూర్యగ్రహణానికి 12 గంటలు ముందు, అలాగే చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు సమయాన్ని సూతకంగా భావిస్తుంటారు. కాకపోతే మే 5 ఏర్పడుతున్న ఈ పెనుంబ్రల్ చంద్రగ్రహణానికి మాత్రం సూతకం వర్తించదు అని పండితులు చెబుతున్నారు.

ఇండియాలో చంద్ర గ్రహణం సమయాలు
టైమ్ అండే డేట్.కామ్ అనే వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ చంద్ర గ్రహణం మే 5న రాత్రి 8:44 గంటలకి ప్రారంభమై అర్ధరాత్రి దాటాకా మే 6న 1:01 గంటలకి ముగియనుంది. 4 గంటల 18 నిమిషాల పాటు ఈ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఎంపీ బిర్లా ప్లానెటోరియం తెలిపిన వివరాల ప్రకారం ఇండియాలో ఏ ప్రాంతంలో నుంచి అయినా చంద్ర గ్రహణం అని దశలను వీక్షించవచ్చు. 

చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో చేయవలసినవి, చేయకూడని పనులు
హిందువుల ఆచారాల ప్రకారం చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం సమయాల్లో క్రమం తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తుంటారు. అలా పాటించేవి, పాటించకూడని పనుల జాబితా చాలా పెద్దదే ఉంది. గ్రహణం సమయంలో వంటలు చేయకపోవడం, తినక పోవడం వంటి పద్ధతులు పాటిస్తుంటారు. అలాగే గ్రహణం వీడిన తరువాత స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేయడం వంటి పనులు కూడా చేస్తుంటారు. అయితే, వీటిని పాటించడం, పాటించకపోవడం అనేది వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. 

ఎండిన గడ్డి ( దీనినే దుర్బ గడ్డి అని కూడా పిలుస్తుంటారు ) లేదా తులసి ఆకులను మీ వంట గదిలో ఆహార పదార్థాలు ఉన్న పాత్రలపై ఉంచుతుంటారు. గ్రహణంతో కలిగే దుష్బ్రభావాలు ఆహార పదార్థాలపై పడకుండా ఉంటుంది అనేది ఈ ఆచారం వెనుకున్న నమ్మకం.

గ్రహణం పట్టిన సమయంలో గర్భిణీలు ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని.. పనులకు దూరంగా ఉండటం వల్ల కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు అనేది ఒక విశ్వాసం. లేదంటే గ్రహణం ఏర్పడిన సమయంలో సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తూ దైవ ధ్యానంలో గడపడం మంచిదని భావిస్తుంటారు. గ్రహణం అంటేనే ఒక గండం లాంటిది అని భావించే వారు కొంతమంది మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తుంటారు.

Trending News