Shani Shukra Yuti 2023: ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికను యుతి అంటారు. గ్రహాల సంయోగం కారణంగా శుభ లేదా అశుభ యోగాలు ఏర్పడతాయి. శని మరియు శుక్రుడి కలయిక వల్ల రెండు రోజుల కిందట అంటే మే 06న నవపంచం రాజయోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం మూడు రాశులవారికి శుభప్రదం కానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల నవపంచం రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కల నెరవేరుతుంది. మీరు పాత పెట్టుబడుల నుండి ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది.
కన్యా రాశి
శుక్ర సంచారం వల్ల నవపంచం రాజయోగం ఏర్పడుతోంది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. సృజనాత్మక రంగంతో ఉన్న వ్యక్తులు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ముందుకు వెళతారు. 
కుంభ రాశి
శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో కూర్చున్నాడు. దీంతో మీరు గరిష్ట ప్రయోజనం పొందనున్నారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీకు మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. 


Also Read: Rajyoga: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులకు ఊహించని ధనలాభం.. ఈ జాబితాలో మీరాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook