Vastu Tips: ప్రస్తుతం నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. లేకపోతే ఆ ఇంట్లో నెగెటివ్ శక్తులు ప్రసరిస్తాయని నమ్ముతారు. ఫలితంగా ఇంట్లో ప్రతికూల ప్రభావం పడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో చాలా పండుగలుంటాయి. నవరాత్రి, దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇలా పండుగల సందడి ఎక్కువే ఉంటుంది. పండుగల వేళ దేవీ దేవతల్ని ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇంట్లో, పరిసరాల్లో శుచి శుభ్రత, ప్రత్యేక వంటలు ఇలా చాలా చేయాల్సి ఉంటుంది. ఎక్కడా ఎలాంటి లోపం రానివ్వకూడదు. పండగ అనేది ఆ ఇంట్లో లేదా బంధువుల్లో ఆనందాన్ని తెస్తుంది. పండుగ సమయంలో కొన్ని వాస్తు సూచనలు పాటించడం వల్ల నెగెటివ్ శక్తుల్ని దూరం చేయవచ్చంటారు. అంతేకాకుండా ఆ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయంటారు. ఇంట్లో నెగెటివ్ శక్తుల్ని దూరం చేసేందుకు వాస్తుశాస్త్రం చేసే సూచనలేంటనేది తెలుసుకుందాం.


పండుగ వేళ ప్రత్యేకించి మీ కంటే పెద్దలు లేదా పేదల్ని అవమానపర్చకూడదు. ప్రత్యేకించి అగౌరవంగా, అసాంఘికంగా మాట్లాడకూడదు. పండుగ పర్వదినం సమయంలో ఎవరి మనసూ నొప్పించకుండా చూసుకోండి. మరీ ముఖ్యంగా అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్త పడాలి. పెద్దవారిని సదా గౌరవిస్తుండాలి. ఇంట్లో లేదా బయట పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవాలి. పండుగ సమయంలో ఇంట్లో ఏదైనా విరిగిన వస్తువులుంటే బయట పారేయండి. ఇంట్లో అలాంటివి లేకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే అది అశుభానికి సూచకమని నమ్మకం. దీనివల్ల అపరిశుభ్రత నెలకొంటుంది. ఇంటి పరిసరాలు పూర్తిగా పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి.


ఇక వస్త్రధారణపై కూడా శ్రద్ధ పెట్టాలి. పండుగ వేళ చిరిగిన బట్టలు ధరించకూడదు. ఇది మంచిది కాదు. చిరిగిన బట్టలు ధరిస్తే అది ఆ ఇంట్లో నెగెటివ్ శక్తులకు కారణమౌతుంది. అంటే కొంతమంది ఫ్యాషన్ పేరుతో రంధ్రాలు, చిరిగిన జీన్స్ ధరిస్తుంటారు. ఇలాంటివి మానేయాలి. సంస్కృతీ సాంప్రదాయాల్ని గౌరవించే బట్టలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యేకించి పండుగ సమయాల్లో వాస్తు సూచనల్ని తప్పకుండా పాటించాలంటారు జ్యోతిష్యులు. 


Also read: Dreams in Navratri 2023: నవరాత్రి సమయంలో కలలో దుర్గాదేవి కన్పిస్తే ఏం జరుగుతుందో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook