Do these Betel Leaves remedies to get Huge money and wealth in your career: ఎంతో కష్టపడి పనిచేసినా.. ఏ పనిలోనూ విజయం సాధించలేకపోవడం కొందరి జీవితంలో చాలాసార్లు జరుగుతుంటుంది. దాంతో వ్యక్తి జీవితంలో నిరాశ మొదలవుతుంది. దీంతో పాటు ఇంట్లో గొడవలు, వ్యాపారంలో నష్టం, మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడం లాంటి సమస్యలను పెరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వాస్తు దోషాల వల్లనే ఇదంతా జరుగుతుందని పేర్కొనబడింది. వ్యక్తి జీవితంలో ఈ సమస్యలను తగ్గించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని చర్యలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి పూజా కార్యక్రమాలలో తమలపాకులను ఉపయోగిస్తారు. ఎందుకంటే వేద శాస్త్రం ప్రకారం తమలపాకులను శుభప్రదంగా పరిగణిస్తారు కాబట్టి. అలానే వాస్తు శాస్త్రంలో కూడా తమలపాకుల గురించి కొన్ని చర్యలు చెప్పబడ్డాయి. ఓ వ్యక్తి వ్యాపారం నుంచి ప్రతి పనిలో విజయం సాధించడంలో తమలపాకులు సహాయపడుతాయి. కాబట్టి ఆ చర్యలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.


తమలపాకుపై స్వస్తిక గుర్తు: 
ఒక వ్యక్తి తన కెరీర్‌లో విజయం సాధించకపోతే.. నెయ్యి, కుంకుమతో చేసిన స్వస్తిక గుర్తును తమలపాకుపై పెట్టాలి. ఆపై స్వస్తిక గుర్తు ఉంచిన తమలపాకుపై మరిన్ని తమలపాకులు ఉంచి చుట్టాలి. ఈ తమలపాకును మీ స్టడీ రూమ్‌లో ఉంచండి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి తన కెరీర్‌లో మంచి విజయాలు సాధిస్తాడు. వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు ఉద్యోగం కోసం ఎక్కడికైనా వెళితే..ఈ తమలపాకును మీ జేబులో పెట్టుకోండి. దీనివల్ల ఉద్యోగ, వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది.


తమలపాకుపై పవిత్రమైన దారం:
ఓ వ్యక్తికి చాలా డబ్బు వస్తుంది కానీ అది చేతిలో నిలవదు. డబ్బు చేతిలో ఉండటానికి.. ఓ తమలపాకుపై పవిత్రమైన దారం ఉంచి బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, గణేశుడి ఆశీస్సులతో సంపద పెరుగుతుంది. అదే విధంగా ఆలయంలో తమలపాకులు మరియు పవిత్రమైన దారంతో ప్రార్థనలు చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది.


తమలపాకుపై తేనే:
తమలపాకులు గణేశుని మరియు లక్ష్మిదేవి స్వరూపమని వేద శాస్త్రాలలో చెప్పబడింది. అందుకే తమలపాకు ప్రతి పూజలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. తమలపాకుపై తేనే పెట్టి వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల సమస్యలు, దుఃఖాలు తొలగిపోతాయి. దీంతో పాటు వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి.


Also Read: Virat Kohli: ఆ ఒక్కటి లేకుంటే.. విరాట్ కోహ్లీ 100 కాదు 200 సెంచరీలు చేసినా ఉపయోగం లేదు!  


Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం! రిషబ్‌ పంత్‌ పని అయిపోయింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.