Bhogi Pallu: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..
Bhogi Pallu Ela Poyali: భోగి పండుగను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజు ఉదయాన్నే పిల్లలకు భోగి పండ్లను పోసి తల స్నానం చేయిస్తారు. అయితే ఇంతకీ భోగి పనులను ఎందుకు పోస్తారు తెలుసా? భోగి పనులను పోయడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Bhogi Pallu, Bogi Date 2024: తెలుగు ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలు సంక్రాంతి ఒకటి. ఈ పండగను రెండు రాష్ట్రాల ప్రజలు మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులపాటు నిర్వహించే పండగల్లో భాగంగా భోగిని సంక్రాంతికి ముందు రోజు జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ భోగి పండగను వ్యవసాయ ఆధారిత గ్రామాలలో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో రైతులకు పంట చేతికి వచ్చి ధాన్యం ఇంటిముందు కళకళలాడుతూ దర్శనమిస్తుంది.
గతంలో కష్టాలన్నీ ఈ సమయానికి ముగింపు దశకు చేరుకుంటాయి. దీంతో రైతులంతా ఈ భోగి రోజున భోగభాగ్యాలను ఆహ్వానిస్తారు. పురాణాల ప్రకారం గోదాదేవి రంగనాథుణ్ని భోగి పండుగ రోజునే చేపడుతుంది. అలాగే భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పండ్లను పోసే ఆనవాయితీ కూడా పూర్వీకుల నుంచే వస్తోంది. ఇంతవరకు చాలామందికి భోగి పండగ రోజు పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారో తెలియదు..? అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ సాంప్రదాయం వెనుకున్న ఆరోగ్య కారణాలేంటో.. మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న పిల్లల తలమీద రేగి పండ్లను భోగి పండుగ రోజున పోయడం వల్ల వారిపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుందని..అంతేకాకుండా శ్రీమన్నారాయణ అనుగ్రహం కూడా లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే తల పైన బ్రహ్మ రంధ్రాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని తలమీద పోయడంతో ఆ రంధ్రాలు ప్రేరేపితం అవుతాయి. దీనికి కారణంగా పిల్లలను జ్ఞానం రెట్టింపు అవుతుందని పూర్వీకులు చెబుతున్నారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
భోగి పండగ రోజు భోగి పండ్లతో పాటు రేగి పండ్లు చిల్లర నాణ్యాలు బంతి పువ్వుల రెక్కలు వీటన్నిటిని కలిపి చిన్నపిల్లల తలపై పోస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ భోగి పండ్ల వెనుక ఒక కథ కూడా ఉంది. నారాయణులు ఒక వనంలో తపస్సు చేస్తుండగా ఆనాడు దేవతలు బదరీ ఫలాలను వారి తలపై కురిపిస్తారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ పిల్లలను సాక్షాత్తు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోయడం సాంప్రదాయంగా వస్తోంది. అలాగే రేగి పనులను సాక్షాత్తు సూర్యభగవానుడిగా భావిస్తారు. కాబట్టి ఈ పండ్లను వారి తలపై పోయడం వల్ల సూర్యుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని వారి నమ్మకం..
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter