Ayodhya Temple: ఏపీ నుంచి అయోధ్యకు భారీ కానుక.. కిలో బంగారం.. 13 కేజీల వెండితో ధనస్సు
Lord Sri Ram Will And Arrow With Gold Silver From AP: హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి కొత్తగా కట్టించిన అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతుండగా.. దాంతోపాటే కానుకలు భారీగా వచ్చి చేరుతున్నాయి. తాజాగా ఏపీ నుంచి అయోధ్యకు భారీ కానుక వెళ్లింది. ఏమిటో తెలుసుకోండి.
Ayodhya Temple: ఈ ఏడాది ఆరంభంలో అయోధ్యలో బాల రామాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే. రాముడి జన్మభూమిగా భావించే అయోధ్యలో కొలువుదీరిన ఆ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా.. అదేస్థాయిలో కానుకలు, విరాళాలు భారీగా అయోధ్యకు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్యకు భారీ కానుక వెళ్లింది. ఒక కిలో బంగారం.. 13 కిలోల వెండితో తయారుచేసిన రాముడి చేతిలోని ఆయుధం ధనస్సును తయారు చేసి అయోధ్యకు పంపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ, ఏమిటో అనే వివరాలు తెలుసుకుందాం.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో బంగారం, వెండితో ధగధగలాడుతున్న ధనస్సు చేరింది. ఈ ఆలయంలో బుధవారం ధనస్సుకు ప్రత్యేక పూజలు జరిగాయి. అయోధ్య రాముడికి చల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహా ధనస్సును తయారు చేయించారు. ఏడు అడుగుల పొడవైన ఈ ధనస్సును ఒక కిలో బంగారంతోపాటు 13 కిలోల వెండితో రూపొందించారు. ఎంతో ప్రత్యేకతలు కలిగిన ఈ ధనస్సును రూపొందించారు. ప్రత్యేక శ్రద్ధలతో కొన్ని వారాల పాటు శ్రమించి ధనస్సును తీర్చిదిద్దారు.
Also Read: Sri Dutta Kshetram: అక్కడ ప్రదక్షిణ చేస్తే చాలు.. ఎంతటి కోరికలైనా నెరవేర్చే కల్పవృక్షం
ఈ ధనస్సును రాముడి జన్మస్థలం అయోధ్యకు తీసుకెళ్తూ భీమవరం చేరుకుంది. ఆలయానికి చేరుకున్న ధనస్సుకు ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య నగరానికి వెళుతున్న ఈ రామ ధనస్సు ఎంతో విశిష్టమైనదని అర్చకులు తెలిపారు. ఏడు మోక్షమార్గాలలో అయోధ్య మొదటిదని వివరించారు. ఒక కేజీ బంగారం, 13 కేజీలు వెండితో తయారుచేసిన ఈ ధనస్సు త్వరలో అయోధ్యకు చేరుకుంటుందని చల్లా శ్రీనివాస్ వెల్లడించారు. ధనస్సు చూసేందుకు స్థానిక ప్రజలు తరలివచ్చారు. ధనస్సుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధనస్సుతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి