Guru Chandra Yuti 2023: మేషరాశిలో అరుదైన రాజయోగం... ఈ 3 రాశులవారిపై కనక వర్షం..
Gajkesari Rajyog 2023: మేషరాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు మంచి లాభాలను పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Brihaspati and Chandra Yuti 2023: గ్రహాల కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. తద్వారా ఇవి రాజయోగాలను ఏర్పరుస్తాయి. ఏ వ్యక్తి జాతకంలో రాజయోగం ఉంటుందో వారు సకల భోగాలను పొందుతారు. అలాంటి రాజయోగాల్లో గజకేసరి రాజయోగం ఒకటి. ఇది చంద్రుడు, బృహస్పతి కలయిక వల్ల ఏర్పడుతుంది. ప్రస్తుతం గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. రీసెంట్ గా చంద్రుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించాడు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల గజకేసరి యోగం ఏర్పడింది. చంద్రుడు బృహస్పతి ఉన్న రాశి నుండి దశమి, సప్తమ లేదా నాల్గవ ఇంట్లో ఉన్నప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి వారికి గజకేసరి రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
మిధునరాశి
గజకేసరి యోగం మిథునరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీ ఆర్థికంగా మెరుగుపడతారు. మీరు కొక్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
తులారాశి
చంద్రుడు తులారాశి యెుక్క పదవ ఇంట్లోనూ, బృహస్పతి ఏడవ ఇంటిలోనూ సంచరిస్తాడు. దీంతో మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
Also Read: Chaturgrahi Yoga: మేష రాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ రాశులకు ఊహించని ధనలాభం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి