Budhaditya Rajyog 2023: శనిదేవుడి రాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశులకు తిరుగులేనంత అదృష్టం..
Budhaditya Rajyog 2023: త్వరలో మకరరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Budhaditya Rajyog In Capricorn 2023: గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశికి మారడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. దీని ప్రభావం మానవ జీవితంపై పక్కాగా ఉంటుంది. బుధుడు మరియు సూర్యుని కలయిక వల్ల మకరరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. బుధుడు మరియు సూర్యుని కలయిక వల్ల ఈ యోగం ఏర్పడనుంది. బుధాదిత్య రాజయోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం (Aries): బుధాదిత్య రాజయోగం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి యెుక్క కర్మ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. మీరు పని, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం చేసేవారు పెద్ద పెద్ద డీల్స్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ప్లేస్ కు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.
మకర రాశిచక్రం (Capricorn): బుధాదిత్య రాజయోగం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకానికి చెందిన లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడుతోంది. మీ జీవిత భాగస్వామి యెుక్క సపోర్టు ఎల్లవేళలా ఉంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనిలో మంచి విజయాన్ని సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
కన్య రాశిచక్రం (Virgo): బుధాదిత్య రాజయోగం మీకు శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా ఉన్నత విద్యాసంస్థలో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సంతానం లేనివారికి పిల్లలు కలుగుతారు.
Also Read: Mangal Margi 2023: అంగారకుడి గమనంలో పెను మార్పు.. ఇక వీరికి లక్కే లక్కు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook