Mangal Margi 2023: అంగారకుడి గమనంలో పెను మార్పు.. ఇక వీరికి లక్కే లక్కు..

Mangal Margi 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని రెడ్ ప్లానెట్, గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. వృషభరాశిలో కుజుడు ప్రత్యక్షంగా సంచరించాడు. మార్స్ సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 02:33 PM IST
Mangal Margi 2023: అంగారకుడి గమనంలో పెను మార్పు.. ఇక వీరికి లక్కే లక్కు..

Mangal Margi In 2023: అంతరిక్షంలో గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తాయి. కొన్ని గ్రహాలు సంచారంలో ఉంటే.. మరికొన్ని గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. జనవరి 13న భూమిపుత్రుడు మంగళదేవుడు వృషభరాశిలో తిరోగమనం నుండి మార్గంలోకి (Mangal Margi 2023) వచ్చాడు. మంగళదేవుడి సంచారం వల్ల మూడు రాశులవారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మార్స్ ప్రత్యక్ష సంచారం ఈ రాశులకు బోలెడు లాభం
మేష రాశిచక్రం (Aries); కుజుడి ప్రత్యక్ష సంచారం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మార్స్ మీ రాశిచక్రం నుండి రెండవ ఇంట్లో ప్రయాణించనుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో మనస్పర్థలు, గొడవలు తొలగిపోతాయి. మేష రాశి వారికి ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు.

వృషభ రాశి (Taurus): వృషభ రాశి వారికి అంగారకుడి సంచారం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు జరుగుతున్న మాంగ్లిక్ దోషం నుండి విముక్తి పొందబోతున్నారు. అంతేకాకుండా వీరు భూమి, ఆస్తుల నుండి ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

వృశ్చిక రాశిచక్రం (Scorpio): అంగారకుడి మార్గం మీరు ఆర్థికంగా బాగుంటుంది. ఎందుకంటే మీ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పనిలో విజయం ఉంటుంది. వ్యాపారస్తులకు ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాజకీయాలతో సంబంధం ఉన్నవారు మంచి పదవిని పొందుతారు.

Also Read: Surya Shani yuti 2023: 30 ఏళ్ల తర్వాత మకరరాశిలో తండ్రీకొడుకుల కలయిక.. ఈ 3రాశులకు తిరుగులేదు ఇక.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News