Budh Asta 2023: సూర్యుడు, బుధుడు, రాహువు గ్రహాలు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాయి.  బృహస్పతి గ్రహం ఏప్రిల్‌ 22 తర్వాత మేష రాశిలోకి రావడం వల్ల.. చాలా రాశులవారికి భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మూడు గ్రహాలు మేష రాశిలో ఉండడం వల్ల ఈ కింద పేర్కొన్న 3 రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడు ఏప్రిల్ 23న రాత్రి 11.58కి మేషరాశిలో సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు రాబోతోందని నిపుణులు అంటున్నారు. బుధుడు స్థానం బలంగా ఉంటే అన్ని రాశులవారు ఆరోగ్య, ఆర్థిక  పరంగా చాలా లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


మేషరాశి:
మేష రాశివారికి బుధుడు ఆరవ స్థానంలో అధిపతి దశలో ఉండబోతున్నాడు.  కాబట్టి ఈ క్రమంలో కష్టపడి పనులు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడం వల్ల చాలా లాభాలు పొందుతారు. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సులభంగా సాధిస్తారు. 


Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..


మిథునరాశి:
మిథునరాశి వారికి బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో మీ ఇంట్లో శుభ కార్యాలు కూడా జరుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ క్రమంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. ఈ రాశివారు కష్టపడి పనులు చేస్తే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


కన్యారాశి:
ఈ రాశివారికి బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. కన్యారాశికి బుధ గ్రహ స్థానం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంచార క్రమంలో ఉద్యోగాలు చేసేవారికి గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. వీరు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెడితే చాలా లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శ్రమ పడి పనులు చేయడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. 


Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook