Budh Asta 2023: ధనుస్సు రాశిలో మెర్య్కూరీ అస్తమయం.. రేపటి నుండి ఈ రాశులవారు జాగ్రత్త...
Budh Asta 2023: బుధ గ్రహం జనవరిలో ధనుస్సు రాశిలో అస్తమించబోతోంది. దీంతో మూడు రాశులవారు డబ్బు, ఆరోగ్యం మరియు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోంటారు.
Mercury Set In January 2023: కొత్త సంవత్సరంలో గ్రహాల గమనంలో పెను మార్పు రానుంది. బుద్ది, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడైన బుధుడు ఈ నెలలో ధనుస్సు రాశిలో అస్తమించబోతున్నాడు. ఎవరి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అతని పనుల ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ప్రస్తుతం ధనుస్సు రాశిలో ఉన్న బుధుడు జనవరి 2న ఇదే రాశిలో అస్తమించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కన్య (Virgo): ఈ రాశికి చెందిన వారి జాతకంలో బుధుడు నాల్గవ ఇంట్లో అస్తమిస్తాడు. దీంతో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా అనేక సమస్యలను ఎదుర్కోంటారు.
సింహం (Leo): బుధ గ్రహం యొక్క అస్తమయం ధనుస్సు రాశి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. మీకు ధన నష్టం వాటిల్లుతుంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టే మందు ఆలోచించండి.
తులారాశి (Libra): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తుల రాశికి చెందిన వారి జాతకంలో బుధుడు మూడవ ఇంట్లో అస్తమిస్తాడు. దీంతో ఈ సమయంలో తుల రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Shani Shukra Yuti 2023: మకరరాశిలో శని-శుక్రల కలయిక.. ఈ రాశులకు కీర్తి ప్రతిష్టలు పెరగడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.