Sugar free Sweets: షుగర్ ఫ్రీ స్వీట్లు తింటున్నారా..?.. మీరు ఈ డెంజర్ లో పడ్డట్లే.. సైంటిస్టులు చెప్తున్న మాటిదే..

Sugar free sweets: మనలో చాలా మంది షుగర్ ఫ్రీ అనగానే ఎగబడి మరీ కొనేస్తుంటారు. ఇటీవల అమెరికా సైంటిస్టుల పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

1 /6

ప్రస్తుతం ఉరుకుల, పరుగుల జీవనంలో మనిషి ఆహరపు అలవాట్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. కనీసం కడుపు నిండా సరైన తిండి, కంటి నిండా నిద్ర దొరకడం గగనమైపోయింది. ఇష్టమున్నట్లు ఆహరపు అలవాట్లు, బైటి జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. 

2 /6

మరోవైపు కొందరు రాత్రిళ్లు నైట్ షిప్టులు చేయడం ఉదయం పూట పడుకోవడం వంటి పనులు చేస్తుంటారు. అంతేకాకుండా.. టిఫిన్ చేయాల్సిన సమయంలో, లంచ్, డిన్నర్ చేయాల్సిన సమయంలో ఏదో ఒక ఫుడ్ తింటూ హెల్త్ ను పూర్తిగా నెగ్లెట్ చేస్తుంటారు. 

3 /6

దీని వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా మనిషి శరీరంలోని జీవగడియారం  పూర్తిగా పాడైపోతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇటీవల చక్కెర వ్యాధికి గురౌతున్నారు. ఇలాంటి వారు స్వీట్లు అస్సలు తినకూడదు. దీంతో మార్కెట్ లో కొత్తగా షుగర్ ఫ్రీ స్వీట్లు అంటూ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. 

4 /6

మార్కెట్ లలో దొరికే.. షుగర్ ఫ్రీ స్వీట్లలో.. ఎరిథ్రిటాల్, సుక్రలొజ్, జినిటాల్ లు వంటి రసాయనాలు ఉంటాయని అమెరికా సైంటిస్టులు తమ పరిశోధనల్లో కనుగొన్నారు. దాదాపు.. 3300 మందిపై మూడేళ్లపాటు ఈ రకంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినట్లు తెలుస్తోంది.

5 /6

రక్తంలోకి చేరే జినిటాల్, ప్లేట్ లెట్లను ఈ రసాయనాలు గడ్డకట్టేలా చేస్తాయని పరిశోధనల్లో తెలింది. దీని వల్ల ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే అవకాశం కూడా ఉంటుందని సైంటిస్టులు కనుగోన్నారు. ఈ క్రమంలో షుగర్ ఫ్రీ స్వీట్లు తినడం కూడా ఆరోగ్యానికి అంతమంచిది కాదంటూ సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. 

6 /6

ముఖ్యంగా షుగర్ వచ్చే ముందు అన్నిరకాల ఫుడ్  ఐటమ్స్ , స్వీట్లు ఒక లిమిట్ లో తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల చిన్న పిల్లలు సైతం షుగర్ వ్యాధికి గురికావడం కాస్త ఆందోళన కల్గించే అంశంగా మారిందని చెప్పుకొవచ్చు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x