Mercury Transit 2022 Effects: ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. మరో రెండు రోజుల్లో అంటే నవంబర్ 13 రాత్రి 9:13 గంటలకు బుధుడు వృశ్చికరాశిలో సంచరించనున్నాడు. అంతేకాకుండా వృశ్చికరాశిలో బుధుడు, శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పరచగా.. బుధుడు, సూర్యుడు సంయోగం వల్ల బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. వృశ్చికరాశిలో బుధుడి సంచారం మెుత్తం 12 రాశులవారిపై కనిపిస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనస్సు రాశి(Sagittarius): ఈ బుధ సంచారం ధనస్సురాశి వారికి మేలు చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. వ్యాపారులకు ఈసమయం అనుకూలంగా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. 


వృషభ రాశి (Taurus): వృషభ రాశి వారికి బుధుని ఈ మార్పు చాలా మేలు చేస్తుంది. మీరు ఆఫీసులో మంచి ఫలితాలను సాధిస్తారు. భాగస్వామ్యంతో చేసే వ్యాపారం లాభాలను ఇస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో సమయం గడపవచ్చు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.   


వృశ్చికరాశి (Scorpio): వృశ్చికరాశిలో బుధుడు సంచరించడం వల్ల లక్ష్మీనారాయణ యోగం, బుద్ధాదిత్య యోగం ఏర్పడతాయి. ఈ రెండు యోగాల వల్ల మీరు అపారమైన ధనాన్ని పొందుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 


కర్కాటక రాశి (Cancer): ఈ బుధ గ్రహ సంచారం కర్కాటక రాశిలోని ఐదవ ఇంట్లో జరుగుతోంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు పురోగతి సాధిస్తారు. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 


మీన రాశి (Pisces): మీనరాశి వారికి బుధ సంచారం మేలు చేసింది. సమాజంలో గౌరవం పెరుగుతుంది మీరు సంతానాన్ని పొందుతారు. పెళ్లికానీ యువతీయువకలుకు వివాహమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.  


Also Read: Vensu Transit 2022: ఈ రోజు నుండి ఈ 4 రాశుల అదృష్టం మారిపోనుంది... వీరికి డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook