Vensu Transit 2022: ఈ రోజు నుండి ఈ 4 రాశుల అదృష్టం మారిపోనుంది... వీరికి డబ్బే డబ్బు..

Vensu Transit 2022: ఇవాళ శుక్రుడు వృశ్చికరాశిలో సంచరించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2022, 09:21 AM IST
Vensu Transit 2022: ఈ రోజు నుండి ఈ 4 రాశుల అదృష్టం మారిపోనుంది... వీరికి డబ్బే డబ్బు..

Vensu Transit in Scorpio on 11th November 2022: సంపద, ఐశ్వర్యం, శృంగారాన్ని ఇచ్చే గ్రహం శుక్రుడు.  ఈరోజు అంటే నవంబరు 11న శుక్రుడు వృశ్చికరాశిలోకి సంచరించనున్నాడు. శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. దీంతో ఈ రాశులవారి జీవితంలో ఆనందంతోపాటు ప్రేమ పెరుగుతుంది. వృశ్చికరాశిలో శుక్రుడి సంచారం (Vensu Transit in Scorpio 2022) వల్ల ఏరాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.  

ఈ రాశుల వారికి శుక్ర సంచారం శుభప్రదం
సింహం (Leo): శుక్రుని సంచారం సింహరాశి వారికి అపారమైన ధనాన్ని ఇస్తుంది. జీవితంలో ఆనందంతోపాటు ఐశ్వర్యం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు జీతంతోపాటు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది. 
తుల (Libra): శుక్ర గ్రహం తులారాశికి అధిపతి. శుక్రుడి రాశిమార్పు ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇస్తారు. పెట్టుబడికి ఇదే అనుకూలమైన సమయం.
కుంభం (Aquarius): శుక్రుని సంచారం కుంభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. బిజినెస్ పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీరు తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది.   
మకరం (Capricorn): నవంబర్ 11న శుక్రుని సంచారం మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. మెుత్తానికి ఈసమయం మీకు కలిసి వస్తుంది.

Also Read: Surya Gochar 2022: వృశ్చికరాశిలోకి సూర్యభగవానుడు... నవంబర్ 16 నుండి ఈ రాశులకు మంచి రోజులు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News