బుధుడి రాశి పరివర్తనం కారణంగా జరిగే మార్పులతో ఆ నాలుగు రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఆ నాలుగు రాశుల్లో మీరున్నారో లేదే చెక్ చేసుకోండి. ఉంటే మీక్కూడా పంట పండినట్టే. ఊహించని డబ్బు మీ చేతికి చిక్కుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పిలుస్తారు. ఈ గ్రహం ఎప్పుడు రాశి పరివర్తనం చేసినా దేవ దేవతలు ఆ గ్రహం సౌందర్యం చూస్తూ ఉండిపోతారట. ఇవాళ అంటే జనవరి 18వ తేదీ సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు ధనస్సురాశిలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం ఏదైనా గ్రహం వక్రమార్గం నుంచి సక్రమమార్గంలో ప్రయనిస్తే మార్గంలోకి రావడమంటారు. ఈ పరిణామం వక్రమార్గం కారణంగా ప్రభావితులైనవారికి విముక్తి కలిగిస్తుంది. కొన్ని రాశుల జాతకుల్ని ధనవంతులుగా మారిస్తే మరి కొన్నిరాశుల జాతకుల్ని దరిద్రులుగా చేస్తుంది. బుధ గోచారం కారణంగా 4 రాశుల జీవితాలపై స్పష్టమైన ప్రభావం పడనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


బుధ గ్రహం ధనస్సు రాశిలో ప్రవేశం
Mercury Transit in Sagittarius


మిధున రాశిలో


ఈ రాశి జాతకులకు మంచి సమయం ప్రారంభం కానుంది. పెళ్లి కోసం సరైన భాగస్వామికై అణ్వేషిస్తుంటే ఆ అణ్వేషణ పూర్తవుతుంది. లక్ష్మీదేవి తరపున మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే ఆమెను లేదా అతడిని మీ తల్లిదండ్రులకు కలపండి. పెళ్లైన భాగస్వాములు పరస్పరం పొరపాట్లతో జీవిస్తుంటే ఆ కష్టాలు తొలగిపోతాయి. ఈ కష్టాలు తొలగాలంటే బెడ్రూమ్‌లో మొక్కను నాటండి


మేషరాశిలో


ఈ రాశి జాతకులు ఉద్యోగం మారాలని అనుకుంటుంటే ఆ కోరిక నెరవేరుతుంది. బుధ గోచారం కారణంగా మంచి కంపెనీలో ఉద్యోగావకాశం లభిస్తుంది. మీరు భార్యతో ఎక్కడికైనా వెళ్లవచ్చు. బంధువులతో కలిసి తిరిగేందుకు ప్లాన్ చేయవచ్చు. మీ ఆరోగ్యం, వృత్తి జీవితంలో ఎదురయ్యే కష్టాల్నించి విముక్తి పొందవచ్చు. దీనికోసం రోజూ తులసి మొక్కకు నీళ్లు పోయాలి. ఓ ఆకును శుభ్రం చేసుకుని తినాలి.


తులరాశిలో


ఈ రాశి జాతకులకు ఇవాళ్టి నుంచి అద్భుతమైన స్వర్ణకాలం ప్రారంభం కావచ్చు. బుధుడి వక్రమార్గం కారణంగా వారికి ఇప్పటి వరకూ తమ లక్ష్యం చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పని చాలా వేగంగా పూర్తవుతుంది. ఇంట్లో సోదర సోదరీమణుల మధ్య  వివాదాలు పరిష్కారమౌతాయి. జీవితంలో తండ్రి, గురువుల నుంచి మార్గదర్శనం లభిస్తుంది. ఇంట్లో తులసి మొక్క నాటుకుని రోజూ ఉదయం , సాయంత్రం పూజలు చేయాలి.


కుంభరాశిలో


ఈ రాశి జాతకులకు ఇంటిపై పెట్టుబడి లేదా వడ్డీపై ఇచ్చిన డబ్బుల ద్వారా ధనలాభం కలుగుతుంది. ఫలితంగా ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు లభిస్తాయి. ప్రేమికులకు అనువైన సమయం. సంతానం కోసం చూసే మహిళలు గర్భం దాల్చవచ్చు. చదువుకునే రచయితలు, మాస్ కమ్యూనికేషన్ విద్యార్ధులకు అనువైన సమయం. దీనికోసం పిల్లలకు పచ్చరంగు వస్తువులు దానంగా ఇవ్వాలి.


Also read: Saturn Transit 2023 Effect: ఈ రాశులపై శని మహాదశ ప్రారంభం.. ఈ పరిహారాలు మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook