Budh Gochar 2023: ఇవాళ బుధుడు మేష రాశిలో సంచరించాడు. దీని కారణంగా ధన సామ్రాజ్య యోగం ఏర్పడింది. తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. తాజాగా ఏర్పడిన సంపద సామ్రాజ్య యోగం నాలుగు రాశులవారికి మేలు చేయబోతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధన సామ్రాజ్య యోగం ఈ రాశులకు వరం
వృషభం- ధన సామ్రాజ్య యోగం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు వ్యాపారంలో పెద్ద డీల్ ను కుదుర్చుకుంటారు. 
మిథున రాశి - ఈ రాశి వారికి సంపద సామ్రాజ్య యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. కుటుంబంతో మీ సంబంధాలు మునుపటి కంటే బలపడతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. పార్టనర్ షిప్ తో చేసే బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 


కన్య - బుధుడి సంచారం వల్ల కన్యా రాశి వారికి లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాంకింగ్ మరియు న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. జాబ్ చేసే వారికి ప్రమోషన్ వస్తుంది. మీ హెల్త్ బాగుంటుంది. 
ధనుస్సు - ధన సామ్రాజ్య యోగం ధనుస్సు రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కెరీర్‌లో మంచి వృద్ధిని సాధిస్తారు. మీ జీతం రెట్టింపు అవుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీరు న్యాయవాది మరియు చార్టర్డ్ అకౌంటెంట్ అయితే మీరు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. 


Also Read: April Festival Calendar 2023: ఏప్రిల్ నెలలో రానున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి