Mercury Transit 2024 effect: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. ఇతడిని తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. ఈరోజు (జనవరి 07) బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏ వ్యక్తి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. మీ సంపద రెట్టింపు అవ్వడంతోపాటు వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ధనస్సు రాశిలో బుధుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఈ 3 రాశులకు వరం
ధనుస్సు రాశి
ఇదే రాశిలో బుధుడి సంచారం జరగబోతుంది. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. జాబ్ సాధించాలనే మీ కల నెరవేరుతోంది. ఆర్థికంగా లాభపడతారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ పేదరిక పోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ రుణ విముక్తి నుండి బయటపడతారు. మీ అప్పులన్నీ తీరిపోతాయి. 
మిధునరాశి
బుధ సంచారం వల్ల ఈ రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు భారీగా ఆస్తులు కూడబెట్టే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. 


Also Read: Budh Shukra Yuti 2024: బుధ, శుక్రుల లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు ప్రభుత్వ ఉద్యోగం పక్కా..


కన్య రాశి
మెర్క్యూరీ సంచారం కన్యా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు విలువైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్  రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత లక్ష్యానికి చేరుకుంటారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. 


Also Read: Gajakesari Yoga: జనవరి 18న గజకేసరి యోగం..ఈ రాశుల వారికి లక్ష్మీదేవి తలుపు తట్టబోతోంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter