Budh Shukra Yuti 2024: బుధ, శుక్రుల లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు ప్రభుత్వ ఉద్యోగం పక్కా..

Rajyog 2024: గ్రహాలు రాశులను మార్చడం ద్వారా రాజయోగాలను ఏర్పరుస్తాయి. బుధుడు, శుక్రుడు సంయోగం వల్ల అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం సంభవించబోతుంది. దీంతో మూడు రాశులవారి అదృష్టం మారబోతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 08:23 PM IST
Budh Shukra Yuti 2024: బుధ, శుక్రుల లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు ప్రభుత్వ ఉద్యోగం పక్కా..

Budh Shukra Yuti 2024 effect: నూతన సంవత్సరం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల అరుదైన లక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల జనవరిలో నెలలో కొన్ని రాశులవారి అదృష్టం మారబోతుంది. లక్ష్మీనారాయణ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

వృశ్చికం: వృశ్చికరాశి వారికి కూడా లక్ష్మీ నారాయణ యుగం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కెరీర్ బాగుంటుంది. ఉద్యోగస్తులకు బోనస్ లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 
మకర రాశి: బుధుడు మరియు శుక్రుడు సృష్టిస్తోన్న లక్ష్మీ రాజయోగం మకర రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు రుణవిముక్తి నుండి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

Also Read: Guru Direct Movement effect: 2024లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం.. ఇందులో మీ రాశి ఉందా?

ధనుస్సు: ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ యుగం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ డబ్బు విపరీతంగా పెరుగుతుంది. ధనస్సు రాశివారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. 

Also Read: Venus Transit 2024: ఇదే నెలలో శుక్రుడి సంచారం..ఈ రాశుల వారికి కనకవర్షంతో పాటు లగ్జరీ లైఫ్ ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News