Mercury set 2023: ఈ నెల 19న బుధుడి అస్తమయం... ఈ 3 రాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా నష్టం..
Mercury set 2023: మరో 8 రోజుల్లో బుధుడు అస్తమించబోతున్నాడు. దీంతో మీరు కెరీర్ లో చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారులు భారీ నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
Budh Asta Effect 2023: గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. ఇటీవల బుధుడు వృషభరాశిలో ప్రవేశించాడు. ఈ నెల 19న అదే రాశిలో మెర్క్యూరీ అస్తమించబోతున్నాడు. సాధారణంగా గ్రహాల అస్తమయం చెడు ఫలితాలనే ఇస్తుంది. మెర్క్యూరీ సెట్టింగ్ ఏయే రాశులవారికి ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
బుధుడి అస్తమయం ఈ రాశులకు నష్టదాయకం
వృషభం
ఈ రాశిలోనే బుధుడు అస్తమించాడు. దీంతో ఈ రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోండి.
కర్కాటక రాశి
జూన్ 19న బుధుడు కర్కాటక రాశిలో పదకొండవ స్థానంలో అస్తమించబోతున్నాడు. దీంతో మీరు వ్యాపార మరియు ఉద్యోగాల్లో ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రేమికుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. రిలేషన్షిప్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం తగ్గవచ్చు. వ్యాపారులు భారీగా నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
Also read: Shani Vakri 2023: 2 సూపర్ రాజయోగాలు చేస్తున్న తిరోగమన శని.. ఈ రాశులపై 4 నెలలపాటు డబ్బు వర్షం..
సింహరాశి
ఈ రాశి యెుక్క పదో ఇంట్లో బుధుడు అస్తమించబోతున్నాడు. దీంతో సింహరాశి వారికి లక్ కలిసిరాదు. మీరు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం అస్సలు కలిసిరాదు.
Also read: Surya Gochar 2023: మరో 5 రోజుల్లో కీలక పరిణామం.. ఈ రాశులకు నెల రోజులపాటు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook