Surya Gochar 2023: మరో 5 రోజుల్లో కీలక పరిణామం.. ఈ రాశులకు నెల రోజులపాటు డబ్బే డబ్బు..

Sun Transit 2023: మరో ఐదు రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం ఉంటున్న వృషభరాశిని వదిలి మిథునరాశిలోకి వెళ్తున్నాడు. సూర్యుడి యెుక్క  ఈ రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2023, 07:02 AM IST
Surya Gochar 2023: మరో 5 రోజుల్లో కీలక పరిణామం.. ఈ రాశులకు నెల రోజులపాటు డబ్బే డబ్బు..

Surya Gochar in Mithun Rashi 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల రాజు సూర్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. మరో 5 రోజుల్లో అంటే జూన్ 15న ఆదిత్యుడు వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మిథున సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రాశిలో భాస్కరుడు నెల రోజులపాటు ఉంటాడు. సూర్యుని సంచారం వల్ల ఏ రాశుల వారికి లాభం చేకూరనుందో తెలుసుకుందాం. 

మేషం: సూర్య సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. 
సింహ రాశి: సూర్యుడి రాశి మార్పు సింహ రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
కన్య: ఆదిత్యుడి సంచారం కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయభేరి మోగిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం  ఉంది. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: Shani Vakri 2023: జూన్ 17 నుండి ఈ 5 రాశులవారికి కష్టాలు షురూ.. మీరున్నారా?

మకరం: భానుడి గోచారం మకర రాశి వారికి గణనీయమైన లాభాలను ఇస్తుంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Yogini Ekadashi 2023: జూన్ 14 నుండి ఈ 3 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News