Budh Guru Yuti 2023: సంపద, తెలివితేటలు, వ్యాపారం, వాక్కు మరియు తర్కానికి కారకుడైన బుధ గ్రహం నిన్న అంటే మార్చి 16, గురువారం నాడు మీనరాశిలోకి ప్రవేశించింది. మరోవైపు, దేవగురువు బృహస్పతి ఇప్పటికే తన సొంత రాశి అయిన మీనరాశిలో కూర్చున్నాడు. దీంతో మీన రాశిలో బుధుడు మరియు బృహస్పతి కలయిక ఏర్పడింది. బృహస్పతి-బుధ సంయోగం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి-బుధ సంయోగం ఈ రాశులకు వరం
వృషభం: వృషభ రాశి వారికి బుధుడు మరియు గురుగ్రహ కలయిక గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయంలో భారీగా పెరుగుదల ఉంటుంది. భారీ ప్యాకేజీతో కొత్త ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అవుతుంది. 
మిథునరాశి: బుధ, గురు గ్రహాల కలయిక మిథునరాశి వారికి వృత్తిపరమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సహోద్యోగులు సహకరిస్తారు.
కన్య: బుధ, గురు గ్రహాల కలయిక వల్ల కన్యా రాశి వారికి ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో మీకు భారీ లాభాలు వస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది. మీ లైఫ్ పార్టనర్ తో సంబంధం బాగుంటుంది. 
ధనుస్సు: బృహస్పతి మరియు బుధ గ్రహాల కలయిక ధనుస్సు రాశి వ్యక్తులకు వ్యక్తిగత మరియు వృత్తి జీవిత పరంగా  రెండింటికీ శుభప్రదం. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా తల్లి నుండి సహాయం అందుతుంది.
మీనం: గురు, బుధ గ్రహాల సంయోగం మీనరాశిలోనే జరగడం వల్ల ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు చేకూరుతాయి. మీరు పనిలో విజయం పొందుతారు. ప్రమోషన్ లభిస్తుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.


Also Read: Mars Transit 2023: మిథునంలోకి ప్రవేశించిన కుజుడు.. ఈ 3 రాశులకు వద్దన్నా డబ్బు, ఉద్యోగంలో ప్రమోషన్స్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook