COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budh Margi 2023: బుధుడు త్వరలోనే తిరోగమన దశలో కదలబోతున్నాడు. సెప్టెంబర్ 16న బుధుడు సింహరాశిలో ప్రత్యేక్షంగా తిరోగమనం చేయబోతున్నాడు. అయితే ప్రత్యేక్ష తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే..మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బుధుడి ప్రత్యేక్ష తిరోగమనం ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రత్యేక్షంగా పడబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఈ రాశులవారిపై బుధుడి తిరోగమన ప్రభావం:
మేష రాశి:

 బుధుడు ప్రత్యక్షంగా సింహరాశిలోకి తిరోగమనం చేయడం వల్ల మేషరాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి బుధుడి అనుగ్రహం లభించి అనుకున్న పనులనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా వృత్తి జీవితం గడుపుతున్నవారికి కూడా  ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా చాలా రకాల లాభాలు పొందుతారు. ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి బుధుడి తిరోగమనం కారణంగా సులభంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతం లేదా బోనస్‌ కూడా లభిస్తుంది.


మిథునరాశి: 
మిథునరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ధైర్యం పెరిగి అన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్‌ లభించి ఉద్యోగాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సహోద్యోగులు, ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


సింహ రాశి:
బుధుడు ప్రత్యక్షంగా తిరోగమనం కారణంగా సింహ రాశివారు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. దీంతో పాటు వీరు చదువు కోసం ఈ సమయంలో విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఒక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించ వచ్చు. ఈ నమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి