Budh Gochar 2022: నవంబర్ 13 వరకు తులరాశిలోనే బుధుడు.. ఈ 3 రాశులవారికి తిరుగుండదు చూడు..
Budh Planet Gochar 2022: జ్ఞానాన్ని మరియు వ్యాపారాన్ని ఇచ్చే గ్రహం బుధుడు. ఇతడు రీసెంట్ గా తులారాశిలో సంచరించాడు. దీంతో 3 రాశుల వారికి మంచిరోజులు మెుదలయ్యాయి.
Budh Planet Gochar In Tula 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడు రాశిచక్రంలో మార్పు ప్రభావం మానవ జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఈనెల 26న బుధుడు తులరాశిలో సంచరించాడు. నవంబరు 13 వరకు అక్కడే ఉంటాడు. తులరాశిలో బుధుడి సంచారం (Mercury transit in libra 2022) మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో అపారమైన ధనాన్ని పొందడంతోపాటు కెరీర్ లో పురగోతిని సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
బుధ సంచారం ఈ రాశులకు వరం..
కన్య (Virgo): బుధుడి రాశిమార్పు వల్ల ఈరాశి వారు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. మీ కెరీర్ లో అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉపాధ్యాయులు, మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సమయం బాగుంటుంది.
కర్కాటకం (Cancer): జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లోకి ప్రవేశించాడు. దీంతో మీరు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీ డబ్బు సంబంధిత సమస్యల్లో చిక్కుకుంటే దాని నుండి బయటపడతారు. సమాజంలో మీ పాపులారిటీ పెరుగుతుంది.
మిథునం (Gemini): బుధ గ్రహ సంచారం వల్ల మీకు మంచి రోజులు మెుదలవుతాయి. బుధుడి ఈరాశి యెుక్క ఐదో ఇంట్లో సంచరిస్తాడు. దీంతో ఈ రాశివారు వ్యాపారంలో అపారమైన డబ్బును సంపాదిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సంతానం లేని పిల్లలను పొందుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Mars Retrograde 2022: మిధునరాశిలో కుజుడు తిరోగమనం.. ఈ మూడు రాశులకు వరం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook