Jadatva Yog effect: మన జాతకంలో గ్రహాల కలయిక వల్ల వివిధ రకాల యోగాలు రూపొందుతాయి. వీటి ప్రభావం కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటాయి. అలాంటి యోగాల్లో జడత్వ యోగం కూడా ఒకటి. ఇది అశుభకరమైన యోగం. ఏ వ్యక్తి యెుక్క కుండలిలో ఈ యోగం ఏర్పడుతోందో వారి పురోగతి ఆగిపోతుంది. విద్యార్థులు అయితే చదువుపై దృష్టి పెట్టలేరు. అంతేకాకుండా పరీక్షల్లో అనుకున్న స్థాయిలో మార్కులు రావు. ఏదైనా జాతకం లేదా రాశిలో రాహువు మరియు బుధుడు కలయిక వల్ల జడత్వ యోగం ఏర్పడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జడత్వం యొక్క ప్రభావం
ఈ యోగంలో జన్మించిన వ్యక్తులు తెలివితక్కువగా ఉంటారు.  వీరు కెరీర్ లో సక్సెస్ కాలేరు. మీకు చదువులో అనేక రకాల ఇబ్బందులు ఎదురువుతాయి. మీకు స్కాలర్ షిప్ రాకపోవడంతో నిరాశకు గురవుతారు. అనుకున్నదానికంటే చాలా తక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అయితే ఈ యోగం ఉన్నవారు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఏర్పడుతోంది. ఇది 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మీరు బుధుడిని సంతోషపెట్టే చర్యలు తీసుకోవాలి. 


ఈ చర్యలు చేయండి
** మీరు చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించాలి. అంతేకాకుండా వినాయకుడికి దూర్వా, లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి.
**  జ్ఞాన దేవత అయిన సరస్వతి మాతను ఆరాధించాలి. చదువుకునే ముందు ధ్యానం చేస్తూ చదువు ప్రారంభించండి.
**  మీ చెల్లెళ్లను ఎప్పుడూ సంతోషంగా ఉంచడం వల్ల బుధుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. 


Also Read: Budh Gochar 2024: ఫిబ్రవరిలో బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం..


Also Read: Guru Pushya Nakshatra: జనవరి 25న అరుదైన యోగం.. ఆ రోజున ఈ వస్తువులు కొంటే మీకే లాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter