Benefits of Budhaditya Yoga: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఈ గ్రహాల కలయిక కొందరికి శుభప్రదంగా ఉంటే, మరికొందరికి అశుభకరంగా ఉంటుంది. తెలివితేటలను ఇచ్చే బుధుడు ఫిబ్రవరి 01న మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. అప్పటికే అదే రాశిలో సూర్యుడు సంచరిస్తాడు. మకరరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
వృశ్చికం (Scorpion): వృశ్చిక రాశి యెుక్క రెండవ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. విదేశాల్లో జాబ్ చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీ లైఫ్ పార్టనర్ తో మాంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. మీకు పూర్వీకుల స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.
మేషం (Aries): మేషరాశి యెుక్క పదవ ఇంట్లో బుధాదిత్య యోగం రూపుదిద్దుకుంటుంది. దీని కారణంగా మీ స్కిల్స్ పెరుగుతాయి. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో సక్సెస్ అవుతారు. మీకు సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి సపోర్టు లభిస్తుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ వ్యాపారం వృద్ధి చెందడంతోపాటు మంచి లాభాలు వస్తాయి. అయితే ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి.
Also Read: Guru Pushya Nakshatra: జనవరి 25న అరుదైన యోగం.. ఆ రోజున ఈ వస్తువులు కొంటే మీకే లాభం..
వృషభం (Taurus): వృషభరాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీంతో మీకు లక్ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు జీతాలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులు లభపడతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Zodiac Signs: ఈ రాశుల వారిపై సిద్ధయోగం ఎఫెక్ట్.. ఈ రోజు నుంచి జరగబోయేది 100 శాతం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter