Budh Gochar 2023: ఫిబ్రవరిలో అరుదైన రాజయోగాలు.. ఈరాశుల జీవితం డబ్బుమయం...
Budh Gochar 2023: ఈ నెలలో కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. బుధుడు, శుక్రుడు, గురుడు మరియు శని గ్రహాలు ఈ రాజయోగాలను ఏర్పరుస్తున్నాయి. దీంతో నాలుగు రాశులవారు భారీగా లాభపడనున్నారు.
Budh Rashi Parivartan: ఈనెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల స్థానంలో మార్పు వచ్చింది. మంత్ ఎండింగ్ లో కూడా కొన్ని ప్లానెట్స్ రాశిలో ఛేంజ్ రానుంది. ఆస్ట్రాలజీలో మెర్క్యూరీని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధుడు ఫిబ్రవరి 27న కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇదే సమయంలో మీనరాశిలో శుక్ర, గురు గ్రహాలు కలిసి డబుల్ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. శని కూడా కుంభంలో రాజయోగాన్ని చేసింది. ఈయోగాల వల్ల 4 రాశులవారికి మేలు జరగనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
వృషభం
మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషభరాశివారికి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ సమయంలో శుక్రుని మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది మీ సృజనాత్మకతను తట్టిలేపుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి.
మిధునరాశి
కుంభరాశిలో బుధుని సంచారం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు వృత్తి, ఆర్థిక విషయాల్లో లాభపడతారు. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. బుధాదిత్య యోగం వల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది.
కుంభ రాశి
ఈ రాశిలో శని ఇప్పటికే రాజయోగాన్ని సృష్టించాడు. ఫిబ్రవరి నెలాఖరులో ఈ రాశిలో బుధుడు సంచరించడం వల్ల ద్వంద్వ రాజయోగం ఏర్పడుతుంది. సాడే సతితో బాధపడే కుంభ రాశి వారికి ఈ సమయం చాలా మేలు చేస్తుంది. ఆఫీసులో అధికారులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు సమాజంలో గౌరవం పొందుతారు.
మీనరాశి
ఈరాశిలో రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో మీ కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆఫీసులో అధికారులు మరియు సహోద్యోగుల సహాయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఫ్యూచర్ కు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Shukra Gochar 2023: 'గురు' రాశిలో శుక్రుడు ప్రవేశం.. ఈరాశుల ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు కుప్పలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
డ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.