Shukra Gochar 2023: 'గురు' రాశిలో శుక్రుడు ప్రవేశం.. ఈరాశుల ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు కుప్పలే!

Venus Transit 2023: లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు బృహస్పతి యెుక్క రాశిలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 08:24 AM IST
Shukra Gochar 2023: 'గురు' రాశిలో శుక్రుడు ప్రవేశం.. ఈరాశుల ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు కుప్పలే!

Shukra Gochar 2023 Effect: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. లవ్, రొమాన్స్ మరియు సంపదకు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఈనెల 15న శుక్రుడు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించాడు. మీనరాశికి అధిపతి బృహస్పతి. పైగా ఈ రెండు గ్రహాలు స్నేహితులు. శుక్రుడి సంచారం వల్ల కొందరిని అదృష్టం వరించనుంది.శుక్రుడు ఏయే రాశులవారిని ధనవంతులను చేయబోతున్నాడో తెలుసుకుందాం. 

శుక్ర సంచారం ఈ రాశులకు వరం
వృషభం
ఈరాశి యెుక్క పదకొండవ ఇంట్లో శుక్రుడు సంచరించాడు. దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ కెరీర్ లో అడ్డంకులు వస్తే వాటిని అధిగమిస్తారు. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. లవ్ లైవ్ బాగుంటుంది. 
కర్కాటక రాశి
శుక్రుని సంచారం కర్కాటక రాశికి అనుకూలంగా ఉంటుంది. మీ రాశిచక్రం యొక్క తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. మీ లక్ కలిసి వస్తుంది. మీరు సమస్యల నుండి బయటపడతారు.ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిన పనులు ఇప్పుడిప్పుడే పూర్తవుతాయి. జాబ్ చేసేవారు ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇదే మంచి సమయం. 
కన్య రాశి
కన్యారాశిలోని సప్తమ రాశిలో శుక్రుని సంచారం జరిగింది. దీంతో మీ లవ్ లైఫ్ బాగుంటుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాలిస్తాయి. బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. 

Also Read: Guru Gochar 2023: పుష్కర కాలం తర్వాత మేషంలో 'గజలక్ష్మీ రాజయోగం'... ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

డ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News