Mercury Rise 2023: న్యూ ఇయర్ లో ఈ 3 రాశులపై బుధుడి ప్రత్యేక అనుగ్రహం... ఇక వీరికి తిరుగుండదు..
Mercury Rise 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధ గ్రహం జనవరి 12 న ఉదయించబోతోంది. మెర్క్యురీ గ్రహం యొక్క రైజింగ్ మూడు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది.
Budh Rise In Dhanu 2023: గ్రహాలు తమ గమనాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ఫ్లానెట్స్ కాలానుగుణంగా ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. మరో వారం రోజుల్లో అంటే జనవరి 12న బుధదేవుడు ధనుస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. ధనుస్సు రాశి బృహస్పతిచే ప్రభావితమవుతుంది. ఆస్ట్రాలజీలో బుధుడు మరియు గురుడు మిత్రులగా భావిస్తారు. మెర్క్యూరీ రైజింగ్ కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి (Leo): మెర్క్యురీ యొక్క ఉదయం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఐదో ఇంట్లో బుధుడు ఉదయిస్తాడు. దీంతో ఇతరులతో మీ బంధం బలపడుతుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ ఫ్యామిలీ సపోర్టు మీకు లభిస్తుంది.
వృశ్చిక రాశిచక్రం (Scorpio): మెర్క్యురీ గ్రహం యొక్క ఉదయం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి రెండో ఇంట్లో ఉదయించబోతోంది. దీంతో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. వ్యాపారవేత్తలు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాదిస్తారు. మీడియా, సినిమా, విద్య వంటి రంగాలకు సంబంధించిన వారు ప్రయోజనం పొందుతారు.
మీన రాశిచక్రం (Pisces): బుధుడు ఉదయించడం వృత్తి మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. బిజినెస్ లో మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది.
Also Read: Shukra Gochar 2023: ఆరుదైన యోగం చేస్తున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు ఏడాది మెుత్తం డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.