Shukra Gochar 2023: అంతరిక్షంలో గ్రహాల సంచారం వల్ల వివిధ రకాల రాజయోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరిలో శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అరుదైన మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శుక్రుడి గోచారం వల్ల ఏర్పడుతున్న రాజయోగం (Malavya Rajyog) వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఫిబ్రవరి 15న రాత్రి 8.12 గంటలకు ఏర్పడబోయే రాజయోగం ఏ రాశివారికి మంచి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.
మాలవ్య రాజయోగం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం పంచమహాపురుష రాజయోగాలలో మాళవ్య రాజయోగం కూడా ఒకటి. ఈ యోగం శుక్రుని సంచారం వల్ల ఏర్పడుతుంది. ఎవరి జాతకంలో శుక్రుడు 1, 4, 7 మరియు 10 వ గృహాలలో వృషభం, తులారాశి లేదా మీన రాశులలో మరియు చంద్రుడు ఉన్నట్లయితే ఈ రాజయోగం ఏర్పడుతుంది. 2023లో శుక్రుడు మూడుసార్లు మాళవ్య రాజయోగాన్ని సృష్టించనున్నాడు. ఫిబ్రవరి 15న మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా మొదటి మాళవ్య రాజయోగం, ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా రెండవది, నవంబర్ 29న తులారాశిలోకి ప్రవేశించడం ద్వారా మూడవది ఏర్పడుతుంది.
రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మిథునం, ధనుస్సు, మీనం రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను సాధిస్తారు.
Also Read: Shani Dev: శనిదేవుడి యెుక్క 'శష మహాపురుష యోగం'.. జనవరిలో వీరికి తిరుగులేని అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.