Budh Shani Yuti in Kumbh 2024: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి ప్రారంభంలో బుధుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కుంభరాశిలో 30 ఏళ్ల తర్వాత శని, బుధ గ్రహాల కలయిక జరగబోతుంది. దీంతో నాలుగు రాశులవారు అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. ఆ రాశులు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహం: సింహరాశికి బుధ, శని కలయిక అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి యెుక్క ఏడవ ఇంట్లో ఈ సంయోగం ఏర్పడబోతోంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు కెరీర్ లో మంచి పలితాలను చూస్తారు. ఇదేరాశిలో శని శష్ రాజయోగాన్ని చేస్తున్నాడు, కాబట్టి మీ ఆదాయం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 
మకరం: బుధ, శని సంయోగం మకరరాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే మీ రాశి యెుక్క సంపద ఇంట్లో ఈ కలయిక జరగబోతోంది. దీంతో మీరు ఊహించని ధనలాభాలను చూస్తారు. మీ వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఆర్ట్స్ మరియు కమ్యూనికేషన్‌కు సంబంధించిన వారికి ఈ సమయం బాగుంటుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. 
కుంభం: శని, బుధుల సంచారం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.  కుంభ రాశి యెుక్క లగ్న గృహంలో ఈ కలయిక ఏర్పడుతుంది. కుంభ రాశికి అధిపతి కూడా శని. కాబట్టి మీరు ఈ సమయంలో ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో లాభపడతారు. 


Also Read: Mercury Transit: ఫిబ్రవరి 1న బుధాదిత్య రాజయోగం.. ఈ రాశుల వారి పంట పండబోతోంది!


మిథునం: మిథునరాశి వారికి శని, బుధుడుల సంయోగం మేలు చేస్తుంది. ఎందుకంటే వీరి కలయిక మీ రాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీకు లక్ కలిసి వస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 


Also Read: Jadatva Yog effect: జాతకంలో ఈ యోగం ఉంటే.. విద్యార్థులకు చదువు బుర్రకెక్కదు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter