Rajyoga: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులకు ఊహించని ధనలాభం.. ఈ జాబితాలో మీరాశి ఉందా?
Astrology: వృషభరాశిలో త్వరలో బుధాదిత్య రాజయోగం సృష్టించబడుతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని ధన లాభాలను పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Benefits of Budhaditya Raja Yoga: ప్రస్తుతం బుధుడు, సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్నారు. వీరు త్వరలో వృషభరాశిలో సంచరించనున్నాడు. వృషభంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడునుంది. ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధాదిత్య రాజయోగం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
సింహ రాశి
సూర్య, బుధ కలయిక వల్ల సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆఫీసులో మీకు సహచరుల మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా మీ బాస్ ప్రశంసలు దక్కుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది.
వృషభ రాశి
బుధాదిత్య రాజయోగం వృషభరాశి వారికి కలిసి వస్తుంది. ఈ జాతకంలోని లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడుతోంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి
బుధాదిత్య రాజయోగం మీకు ఆర్థికంగా లాభిస్తుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీకు వివిధ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీకు విదేశాల నుండి ఊహించనంత ధనం అందుతుంది. పాతపెట్టుబడుల ద్వారా లాభాలను పొందుతారు. కుటుంబంలో బంధాలు బలపడతాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: Shukra Gochar 2023: మే 30 వరకు ఈ రాశులపై డబ్బు వర్షం.. మీది ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook