Budh Surya Yuti 2023: జూలై 17న అరుదైన కలయిక.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..
Astrology: కర్కాటక రాశిలో రెండు పెద్ద గ్రహాల కలయిక ఏర్పడబోతుంది. దీని వల్ల అరుదైన రెండు యోగాలు ఏర్పడబోతున్నాయి. ఇవి ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Mercury Sun Conjunction 2023: కాలానుగుణంగా గ్రహాలు రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఈ నెలలో బుధుడు మరియు సూర్యుడు తమ రాశిచక్రాలను మార్చబోతున్నాయి. జూలై 08న బుధుడు, 17న సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నారు. ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల వల్ల బుధాదిత్య యోగంతోపాటు వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాల వల్ల మూడు రాశులవారిని అదృష్టం వరించనుంది.
కర్కాటకం
ఇదే రాశిలో బుధుడు, సూర్యుడు కలయిక జరగబోతుంది. కర్కాటక రాశి వారికి వ్యతిరేక రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారు లాభపడతారు. బ్యాంకింగ్, పెట్టుబడి, దిగుమతి-ఎగుమతులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మకరరాశి
వ్యతిరేక రాజయోగం మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీరు కోర్టు కేసుల్లో గెలుపొందుతారు. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు రుణ విముక్తి పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు.
Also Read: Shani Retrograde 2023: రివర్స్ లో కదులతున్న శని.. ఇక ఈ రాశుల వారికి కష్టాలు షురూ..
వృశ్చిక రాశి
వ్యతిరేక రాజయోగ ప్రభావం వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. ఉద్యోగం మరియు వ్యాపారంలో ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశం ఉంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read:
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK