Shani Retrograde 2023: రివర్స్ లో కదులతున్న శని.. ఇక ఈ రాశుల వారికి కష్టాలు షురూ..

Vakri Shani 2023: మనం చేసే మంచి చెడులను ఆధారంగా ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయమూర్తి, కర్మదాత అని పిలుస్తారు. తిరోగమన శని వల్ల మూడు రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2023, 05:16 PM IST
Shani Retrograde 2023: రివర్స్ లో కదులతున్న శని.. ఇక ఈ రాశుల వారికి కష్టాలు షురూ..

Shani Retrograde 2023 effect: శని దేవుడి యొక్క కదలిక అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. గత నెలలో శనిదేవుడు తిరోగమనంలోకి వెళ్లాడు. నవంబరు వరకు అతడు అదే స్థితిలో కొనసాగుతాడు. శనిదేవుడి యెుక్క రివర్స్ కదలిక కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. శనిదేవుడి వ్యతిరేకంగా నడవటం వల్ల ఏయే రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
శనిదేవుడి తిరోగమనం కర్కాటక రాశి వారి కష్టాలును పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకండి. చిన్న చిన్న విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ సమయంలో భూమి కొనడం లేదా డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి. అత్తమామలతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. 
సింహరాశి 
శనిదేవుడి రివర్స్ కదలిక మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దిగొద్దు. విడాకుల కేసును ఎదుర్కొంటున్న వారికి సంబంధాన్ని చక్కదిద్దుకోవడానికి ఇదే చివరి అవకాశం. విదేశాలలో నివసించే బంధువులు ద్వారా మీరు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. 

Also Read: Mars Transit 2023: అంగారకుడి సంచారంతో 49 రోజులపాటు భోగభాగ్యాలను అనుభవించే రాశుల వారు వీరే..

కన్య  రాశి
మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కన్య రాశి వారు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలి. సోదరులతో వివాదాలు పెట్టుకోవడం మీకు మంచిది కాదు. చట్టపరమైన పనుల్లో మీరు విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మెుత్తానికి ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 

Also read: Vakri Shani Effect: నవంబర్ 4 వరకు తిరోగమనంలో శని.. ఈ 3 రాశులకు ఊహించనంత మనీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News