Budh Gochar 2022: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా భావిస్తారు. బుధ గ్రహం సెప్టెంబర్ 10 ఉదయం 09:07 గంటలకు కన్యారాశిలో తిరోగమనం (Mercury Retrograde in virgo 2022) చేసింది. అక్టోబరు 2 వరకు అదే స్థితిలో ఉంటుంది. అంటే 23 రోజులపాటు బుధుడు రివర్స్ లో కదులుతాడు. తిరోగమన బుధుడు కొన్ని రాశులవారికి శభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి శుభప్రదం
కన్య (Virgo)- తిరోగమన బుధుడు కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలోనే భద్రయోగం కూడా ఏర్పడుతోంది. కాబట్టి తిరోగమన బుధగ్రహ ప్రభావం కన్య రాశిపై ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రసంగంతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు లాభపడతారు. పిల్లలు వైపు నుంచి శుభవార్తలు వింటారు. 


మకరం (Capricorn)- బుధుడు తిరోగమనం మకర రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో మీ వివాదాలు పరిష్కరించబడతాయి. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. శత్రువులపై విజయం ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 


మీనం (Pisces)- తిరోగమన బుధుడు మీన రాశి వారికి చాలా లాభాలను ఇవ్వనున్నాడు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు.  మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


Also Read: Surya Gochar 2022: కన్యారాశిలో సంచరించనున్న సూర్యభగవానుడు.. రేపటి నుండి ప్రకాశించనున్న ఈ రాశుల అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook