Mercury Retrograde Impact 2022: సెప్టెంబర్ 10న గ్రహాల యువరాజు బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో తిరోగమనం చేశాడు. అదే స్థితిలో అక్టోబర్ 2 వరకు ఉంటాడు. ఆస్ట్రాలజీలో బుధుడిని సంపద, తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు. తిరోగమన బుధుడి ప్రభావం మెుత్తం 12 రాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయం కొన్ని రాశులవారికి కలిసి రాకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశుల వారు తీవ్ర నష్టాలను ఎదుర్కోవచ్చు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో బుధుడు తిరోగమనం చేస్తాడు. కాబట్టి ఈ రాశివారి ఆరోగ్యం పాడై అవకాశం ఉంది. అంతేకాకుండా డబ్బు నష్టం జరుగవచ్చు. ఆఫీసులో మీకు, బాస్ కు పడకపోవచ్చు. ఈసమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఉద్యోగం మారడానికి ఇదే మంచి సమయం. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది.  బుధవారం నాడు పచ్చి కూరగాయలు, పండ్లను దానం చేసి ఆవుకు పచ్చి మేత తినిపించడం ద్వారా ప్రయోజనం  ఉంటుంది. 


సింహం (Leo): ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో మెర్క్యూరీ తిరోగమనం చేస్తాడు. ఈ సమయంలో వీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.  పెట్టుబడి పెట్టాలనుకునేవారి ఆలోచించి పెట్టండి. మాటలను అదుపులో ఉంచుకోండి. మీ ఇంట్లోని చిన్నారులకు ప్రతిరోజూ పంచదార ప్రసాదం పెడితే మీకు మేలు జరుగుతుంది. 


తుల (Libra): ఈ రాశి యెుక్క  12వ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉంటాడు. ఈ రాశివారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీ మాటల ఎవరినైనా బాధపెట్టవచ్చు.  కుటుంబ సభ్యుల అనారోగ్యం దెబ్బ తింటుంది. వీరి కోసం భారీగా ఖర్చు చేయవల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా బుధవారం నాడు ట్రాన్స్‌జెండర్లకు బట్టలు దానం చేయండి.


వృశ్చికం (Scorpio): మీ జాతకంలోని పదకొండవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉంటాడు. బుధుని గమనంలో మార్పు వల్ల ఈ రాశివారి జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. ఈ సమయంలో మీ మాటలు ఎవరినైనా బాధించవచ్చు. ఈ టైంలో డబ్బు ఎక్కడా పెట్టుబడి పెట్టకండి. కొత్త వస్తువులను కొనకండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. సోమరితనంగా ఉండవద్దు. దీనికి పరిష్కారంగా, ప్రతిరోజూ పనికి వెళ్లే ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. 


కుంభం (Aquarius): బుధుడు తిరోగమనం  ఈ రాశి యెుక్క  ఎనిమిదో ఇంట్లో జరుగుతోంది. ఇది మీ ఆర్థిక పరిస్థితి దిగజారేటట్లు చేస్తుంది. స్టాక్ మార్కెట్ కు సంబంధించిన వారు ఈ సమయంలో భారీ నష్టాలను ఎదుర్కోవచ్చు. ఈ ప్రేమ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మరోవైపు, విదేశాలలో చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ సమయంలో మంచి అవకాశాలను పొందే అవకాశం ఉంది. పరిహారంగా ప్రతి సోమవారం శివునికి దూర్వా సమర్పించండి.


Also Read: Sun Tranit 2022: సెప్టెంబర్‌లో అతిపెద్ద 'గ్రహ మార్పు'.. ఈ రాశులకు లక్కే లక్కు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook